Wife Kills Husband: ఆ తప్పు మళ్లీ చేయొద్దన్నందుకు భర్తను చంపేసి ఇంట్లోనే పూడ్చి పెట్టిన భార్య..

|

Jun 02, 2021 | 3:39 PM

Wife Kills Husband: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని దహిసార్ చౌల్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే..

Wife Kills Husband: ఆ తప్పు మళ్లీ చేయొద్దన్నందుకు భర్తను చంపేసి ఇంట్లోనే పూడ్చి పెట్టిన భార్య..
Crime News
Follow us on

Wife Kills Husband: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని దహిసార్ చౌల్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా వంటి గదిలోనూ పూడ్చి పెట్టింది. 11 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రయీస్ షేక్, షాహిదా షేక్ దంపతులు దహిసార్ చౌల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అదే ప్రాంతంలో అమిత్ విశ్వకర్మ అనే వ్యక్తి కూడా నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే అమిత్‌కు, షాహిదాకు మధ్య పరిచయం పెరిగి అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది.

కొన్నాళ్లుగా సాగుతున్న వీరి వ్యవహారం చివరికి షాహిదా భర్త రయీస్‌కు తెలిసింది. దాంతో షాహిదాను, అమిత్ కు రయీస్ వార్నింగ్ ఇచ్చాడు. భర్త బెదిరింపుతో షాహిదా రగిలిపోయింది. అమిత్‌ తో సంబంధానికి అడ్డు వస్తున్న రయీస్‌ను అడ్డు తప్పించాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో అమిత్, షాహిదా కలిసి రయీస్‌ను చంపడానికి పథకం వేశారు. ఈ క్రమంలో 10 రోజుల కిందట రాత్రి రయీస్ నిద్రపోతుండగా అదును చూసి కత్తితో పొడిచి చంపేశారు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత.. విషయం బటయకు తెలియకుండా వంటింట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టారు.

రయీస్‌ను చంపిని షాహిదా, అమిత్ తమకేమీ తెలియదన్నట్లుగా నటిస్తూ వచ్చారు. రయీస్ బయటకు వెళ్లి ఇంకా ఇంటికి తిరిగి రాలేదని అని కుటుంబ సభ్యులను నమ్మించింది. అయితే, పది రోజులైనా రయీస్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. షాహిదాతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ క్రమంలో తొలుత షాహిదా ఇంటికి వెళ్లిన పోలీసులు ఇళ్లంతా పరిశీలించారు. వంట గదిలో టైల్స్ తీసి మళ్లీ వేసినట్లు గుర్తించిన పోలీసులు.. దానిపై షాహిదాను విచారించారు. సమాధానం చెప్పడంలో తడబాటుకు గురవడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. దాంతో తమదైన శైలిలో విచారించగా.. షాహిదా అసలు మ్యాటర్‌ను వెల్లడించింది. చేసిన నేరం ఒప్పుకోవడంతో పోలీసులు షాహిదాను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అమిత్ పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఇద్దరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also read:

BENGAL VIOLENCE: బెంగాల్ హింసపై సుప్రీంకు విద్యావేత్తల లేఖ.. మమత మెడకు బిగుస్తున్న ఉచ్చు