AP Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. విడిపోయి మళ్లీ కలిశారు.. చివరకు భర్తపై పెట్రోల్ పోసి..
Wife killed Husband: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం పాటు కలిసి జీవించారు. ఆ తర్వాత భర్త వేధింపులు తట్టుకోలేక భార్య కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకుంది. బంధువులు సర్ది చెప్పటంతో మళ్లీ కలిసి కాపురం చేస్తోంది.
Wife killed Husband: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం పాటు కలిసి జీవించారు. ఆ తర్వాత భర్త వేధింపులు తట్టుకోలేక భార్య కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకుంది. బంధువులు సర్ది చెప్పటంతో మళ్లీ కలిసి కాపురం చేస్తోంది. అయినా భర్త తీరు మారలేదు. వేధింపులు కూడా తీవ్రమయ్యాయి. దీంతో తట్టుకోలేని భార్య.. లీటర్ పెట్రోల్ తెచ్చి.. మందు తాగి మత్తులో పడుకున్న భర్తపై పోసి నిప్పంటించింది. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పరారైంది. సోమవారం జరిగిన ఈ ఘటన ప్రకాశం (Prakasam district) జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిపాడు మండలం గాజులపాలెం గ్రామానికి చెందిన క్రిష్టిపాటి మోహన కృష్ణారెడ్డి (31) సంతనూతలపాడుకి చెందిన రుక్మిణిని 2011లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే.. మోహన కృష్ణారెడ్డి అప్పటి నుంచి సంతనూతలపాడులోనే నివాసం ఉంటున్నాడు. ఈ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కారు, లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్న కృష్ణారెడ్డి.. మద్యానికి బానిసై భార్య, కుమారుడిని నిత్యం వేధించేవాడు. అయితే.. వేధింపులు తట్టుకోలేక రుక్మిణి అంతకుముందు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. ఆ తర్వాత భర్త ఆగడాలు తట్టుకోలేక 2016లో కోర్టు ద్వారా విడాకులు కూడా తీసుకుంది.
ఈ క్రమంలో కృష్ణారెడ్డి సోదరి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. అయినప్పటికీ.. కృష్ణా రెడ్డిలో మార్పురాలేదు. ఆదివారం రాత్రి కూడా భార్య, కుమారుడిని హింసించాడు. వేధింపులు తాళలేక రుక్మిణి.. మద్యం తాగి వచ్చి మత్తులో పడుకున్న కృష్ణారెడ్డిపై పెట్రోలు పోసి నిప్పంటించింది. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి పొగలు.. మంటలు రావడాన్ని చూసిన స్థానికులు పోలీసులుకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: