Whitener addiction: మత్తు బానిసలకు మరో అవకాశం.. హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రయోగం..!?

|

Jul 05, 2021 | 11:16 AM

మత్తు వదలండి అంటున్నారు పోలీసులు.. వైట్నర్‌తో పాటు మత్తు కలిగించే పదార్థాలు సేవిస్తున్న వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు హైదరాబాద్‌ మహానగర పోలీసులు.

Whitener addiction: మత్తు బానిసలకు మరో అవకాశం.. హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రయోగం..!?
Whitener Addiction
Follow us on

Hyderabad Police on Drug Addicts: మత్తు వదలండి అంటున్నారు పోలీసులు.. వైట్నర్‌తో పాటు మత్తు కలిగించే పదార్థాలు సేవిస్తున్న వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు హైదరాబాద్‌ మహానగర పోలీసులు. విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. వైట్నర్‌తో పాటు ఇతర మత్తు కలిగించే పదార్ధాలు సేవించి రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ, మత్తుకు బానిసలువుతన్న వారికి సౌత్ జోన్ పోలిసులు మానిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందర్నీ ఒకచోటకు చేర్చి కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపట్టారు..

పాతబస్తీ.. చార్మినార్, బహదూర్ పురా, కామాటిపురా, కాలపత్తర్ ప్రాంతాల్లో తిరిగే వైట్నర్ల బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పాతబస్తీ కామాటిపురా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో వైట్నర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సుమారు 45 మంది వరకు ఈ కార్యక్రమానికి వచ్చారు. సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ సయ్యద్ రఫీక్ అధ్వర్యంలో సాగిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో చార్మినార్ ఇంచార్జ్ ఎసీపీ బిక్షంరెడ్డితో పాటు స్థానిక చార్మినార్ ఎసిపి పరిధిలొని ఇన్స్ పెక్టర్లు పాల్గొన్నారు.

ప్రతి నిత్యం మత్తులో ఉండే వీరిలో కొందరు, కొన్నిసార్లు అనుకోని దుర్ఘటనకు గురై అన్ నోన్ పర్సన్ , గుర్తు తెలియని వ్యక్తులుగా ఉండిపోతున్నారు. చెడు అలవాట్లతో నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో వీరిని రక్షించాలన్న ఉద్దేశ్యంతో కౌన్సిలింగ్ నిర్వహిస్తూనే కామాటిపురా పోలిసులు వైట్నర్ల చిరునామాలు అడిగి నమోదు చేసుకున్నారు. మత్తుకు బానిసైన వీరిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలన్న ఉద్దేశంతో పోలీసులు కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మత్తుకు బానిసై విలువైన జీవితాలను నాశనం చేసుకుకోవద్దని సూచిస్తున్నారు. మెల్ల మెల్లగా ఈ మత్తు వ్యసనం నుంచి బయట పడేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Read Also… 

 Death Spots: మరణ మృదంగం మోగిస్తున్న ప్రధాన రహదారి.. ఏడాది కాలంలో 37 మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు

తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థులు.. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌