విశాఖ నరమేధంలో కొత్త ట్విస్ట్‌.. జుత్తాడ హత్యల కేసులో నిందితుడు అప్పలరాజు షాకింగ్ కామెంట్స్.. TV9 Exclusive

విశాఖ నరమేథంలో గంటకో ట్విస్ట్ బయట పడుతోంది. పోలీసుల విచారణలో నిందితుడు అప్పలరాజు కొత్త కొత్త విషయాలు చెబుతున్నాడు.

విశాఖ నరమేధంలో కొత్త ట్విస్ట్‌.. జుత్తాడ హత్యల కేసులో నిందితుడు అప్పలరాజు షాకింగ్ కామెంట్స్.. TV9 Exclusive
Visakhapatnam Six Members Murder Case New Twist
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 17, 2021 | 4:13 PM

Visakha six members murder case: విశాఖ నరమేథంలో గంటకో ట్విస్ట్ బయట పడుతోంది. పోలీసుల విచారణలో నిందితుడు అప్పలరాజు కొత్త కొత్త విషయాలు చెబుతున్నాడు. విజయ్ భార్య వెటకారపు నవ్వే తనలోకసి పెంచింది అంటున్నాడు. కేవలం 15 నిమిషాల్లో అందర్నీ అంతమొందించానని చెప్పాడు. అయితే ఈ హత్య కేసులో అప్పలరాజుతో పాటు మరికొందరు ఉన్నారంటున్నాడు బాదిత కుటుంబ సభ్యులు.

ఇదిలావుంటే, పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెల్లడించాడు నిందితుడు. విచారణ అనంతరం అప్పలరాజును 14 రోజుల రిమాండ్‌కు తరలించారు పోలీసులు. చిన్న పిల్లలను కూడా చంపేంత కసి అతడిలో ఎందుకు పెరిగింది..? పాత కక్షలుంటే మాత్రం ఇంత పాశవిక హత్యలా..? అసలు అప్పలరాజు రాక్షసుడిలా ఎందుకు మారాడు…?

ఒక్కడే ఆరుగురినీ అంతమొందించాడు…! కేవలం పావు గంటలోనే నాలుగేళ్ల పగ తీర్చుకున్నాడు. పోలీసుల దర్యాప్తులో అప్పలరాజు చెప్తున్న నిజాలివి. విచక్షణ కోల్పోయి సైకోలా మారిపోయాడు. గేటు దగ్గర మొదలు.. వంటగది వరకూ మారణహోమం సాగింది. పావుగంటలో ఆరుగురిని అంతమొందించాడు. అప్పలరాజును రెండు రోజులు విచారించిన పోలీసులు.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. అనంతరం 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.

ఇంత చేసినా.. నిందితుడిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. హత్యలు చేసిన నిందితుడు అప్పలరాజును వివరణ కోరేందుకు టీవీ 9 బృందం ప్రయత్నించింది. తాను చేసిన పనిని తప్పుగా అంగీకరించడంలేదు అప్పలరాజు. తన కూతురుకు అన్యాయం జరిగిందనే.. హత్యలు చేశానంటూ టీవీ9తో చెప్పాడు నిందితుడు.

తొలుత ఇంటి ముందున్న విజయ్ భార్యను.. ఆ తరువాత విజయ్ తండ్రి రమణను హతమార్చాడు నిందితుడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన విజయ్ అత్త, చిన్న అత్తలను కూడా నరికి చంపాడు. తర్వాత గదిలో ఉన్న చిన్న పిలల్లను కూడా కిరాతకంగా చంపేశాడు నిందితుడు. ఆ తర్వాత అప్పలరాజు.. అరగంట పాటు అక్కడే కూర్చొన్నట్టు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. హత్యపై పోలీసుకు సమాచారం కూడా అప్పలరాజే ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, విజయ్‌ తండ్రి, భార్య తనను చూసి వెటకారంగా నవ్వడమే… హత్య చేసేలా చేసిందని నిందితుడు అప్పలరాజు చెప్తున్నాడు. ఇంత చేసినా.. నిందితుడిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. తన కూతురుకు అన్యాయం జరిగిందనే.. హత్యలు చేశానంటూ చెప్తున్నాడు నిందితుడు.

విశాఖ నరమేధంలో నిందితుడు ఒక్కడేనా.. విజయ్‌ ఆరోపిస్తున్నట్టు ఇంకా ఎవరైనా ఉన్నారా..? అప్పలరాజు ఒక్కడే నిందితుడని అంతా భావిస్తున్నారు. తానే నిందితుడినని అతడు కూడా పోలీసులకు లొంగిపోయాడు. అప్పలరాజు ఒక్కడే హత్య చేసినట్టు పోలీసులూ చెబుతున్నారు. కానీ, హత్యలో ఇంకొందరి సహకారం ఉందని భాదిత కుటుంబానికి చెందిన విజయ్ ఆరోపిస్తున్నాడు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. హత్యకు సంబంధం ఉన్నట్టు మరికొందరి పేర్లును కూడా విజయ్‌ ఆరోపిస్తున్నాడు.

ఈ హత్యలకు భూ తగాదాలే కారణమని విజయ్ అంటున్నాడు. తన ఇంటిపక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేస్తే.. అడ్డుకున్నాననే కక్షతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు చెబుతున్నాడు. విజయ్‌ ఇంటి పక్కన ఉన్న స్థలం హంతకుడు అప్పలరాజుకు చెందినది. ఎదురుగా ఉన్న ఇల్లు అప్పలరాజు సోదరుడిది. ఈ మధ్యలో విజయ్‌ ఇల్లు ఉండటంతో దాన్ని అమ్మేయాలని పలుమార్లు ఒత్తిడి తెచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. అయినా, దాన్ని అమ్మేందుకు విజయ్‌ తండ్రి రమణ నిరాకరించడం, దానికి తోడు వివాహేతర సంబంధం బయటపడటం.. అప్పలరాజులో పగని పెంచింది. దీని వల్లే మారణహోమానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా… పోలీసులు మాత్రం హత్యలకు వివాహేతర సంబంధం కారణమా.. లేక ఆస్తి తగాదాలా..? మరో కారణమేదైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Read Also… ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్… ఎమోషనల్ అయిన బిగ్‏బాస్ బ్యూటీ.. లైవ్‍లోనే కన్నీళ్లు పెట్టుకున్న అషూరెడ్డి…