Hyderabad: కన్నబిడ్డను అమ్మేసిన కసాయి తండ్రి బావురుమంటున్న తల్లి!
క్రమేపీ మానవత్వం మంటగలిసిపోతోంది. డబ్బుకోసం ఏ పని చేయడానికి కూడా వెనుకాడటం లేదు కొందరు. ఆలిని ఆమ్మేసే ప్రబుద్ధులు కొందరైతే.. పిల్లలను అమ్మకానికి పెట్టేసే వారు మరికొందరు.
Hyderabad: క్రమేపీ మానవత్వం మంటగలిసిపోతోంది. డబ్బుకోసం ఏ పని చేయడానికి కూడా వెనుకాడటం లేదు కొందరు. ఆలిని ఆమ్మేసే ప్రబుద్ధులు కొందరైతే.. పిల్లలను అమ్మకానికి పెట్టేసే వారు మరికొందరు. కనీసపాటి ఇంగితం లేకుండా కన్నబిడ్డల్ని విక్రయిస్తున్న ఒక దుర్మార్గుడి వైనం హైదరాబాద్ రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. సయ్యద్ హైదర్, షహానా బేగం దంపతులు రాజేంద్రనగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి రెండు నెలల వయసున్న బిడ్డ ఉన్నాడు. ఈ పసివాడిని విక్రయించేశాడు తండ్రి సయ్యద్ హైదర్. తల్లి నమాజ్ కు వెళ్ళిన సమయంలో బిడ్డను తీసుకుని పారిపోయాడు సయ్యద్. నామాజ్ ముగించుకుని వచ్చిన బిడ్డ తల్లి షహానా బేగం ఇంట్లో తన పసికందు కనబడలేదు. దీంతో చుట్టుపక్కల ఇళ్ళలో వెతికింది. పక్కింటి వారి వద్దకు పరుగులు తీసింది. రోదిస్తూ వారిని అడిగింది. అంతా కలిసి బిడ్డ కోసం కొద్దిసేపు వెదికారు. ఎంత వెదికినా బిడ్డ దొరకలేదు. కొద్ది సేపటి తరువాత ఆమెకు అనుమానం వచ్చింది. తన భర్త కూడా కనిపించకపోవడంతో అతనిపై అనుమానం కలిగింది. దీంతో రాజేంద్రనగర్ పోలీసులను తల్లి షహానా బేగం ఆశ్రయించింది. తన భర్తపై ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తన బిడ్డను అమ్మేందుకు యత్నించిన భర్త సయ్యద్ హైదర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని భార్య పోలీసులను కోరింది.
కీచక మామ.. కోడలినే చెరచాలని ప్రయత్నం!
కోడుకు భార్యపైనే కన్నేసిన కీచక మామ కోడలిని చెరచాలని ప్రయత్నించిన ఘటన అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. నగరంలోని బాపూనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త అత్తమామలతో కలిసి ఉంటోంది. ఒకరోజు భర్త ఆఫీసుకు వెళ్ళిపోయాడు. అత్త ఫస్ట్ ఫ్లోర్ లో నిద్రపోతోంది. ఈమె వంట చేసుకుంటోంది. ఈ సమయంలో వంటింట్లోకి వచ్చిన మామ కోడలి చీర లాగాడు. తన కోరిక తీర్చాలంటూ నీచానికి దిగాడు. కోడలు ప్రతిఘటించడం తొ చంపేస్తానని బెదిరించాడు. ఆమె పై అత్యాచారానికి దిగాడు. ఈ సమయంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఆమె కొడుకు వంటింటి వద్దకు వచ్చాడు. దీంతో ఆ కీచక మామ అక్కడ నుంచి పారిపోయాడు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Covid-19 News: కరోనా విలయతాండవం…కేంద్రానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సూచనలు