ATM theft case: చేసిన అప్పులు తీరడం లేదు.. సంపాదన కూడా అంతంత మాత్రమే ఉంది. దీంతో అప్పులు తీర్చే మార్గం తెలియక తీవ్రమైన ఒత్తిడి మొదలైంది. ఇక దొంగతనం ఒక్కటే మార్గమనుకున్నాడు. ఏదో ఒక బ్యాంకు ఏటీఎం కొట్టేస్తే కష్టాలు తీరుతాయనుకున్నాడు. యూట్యూబ్‌లో చూసి చోరీ ఎలా చేయాలో తెలుసుకున్నాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో కలకలం సృష్టించింది. విశాఖ జిల్లా అనకాపల్లి ఎల్ఎన్ నగర్ కు చెందిన మోహన్ వ్యసనాలకు బానిసయ్యాడు. దాదాపు అయిదు లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. ఈ సమయంలో బ్యాంకు చోరీకి సంబంధించిన ఓ వీడియోను యూట్యూబ్‌లో చూశాడు. సులభంగా డబ్బు ఎలా కొల్లగొట్టాలోనని ఏటీఎం చోరీ వీడియోను సెర్చ్ చేశాడు. ఇక పని ప్రారంభించాడు.
అంతా ప్రణాళిక చేసుకున్నాక పెరుగుబజార్ వద్దనున్న యూనియన్ బ్యాంక్ సెక్యూరిటి గార్డును ఒప్పించాడు. ఇద్దరూ కలిసి నిర్మానుష్య ప్రాంతంలోని గుండాల వద్ద ఏటీఎం కొల్లగొట్టాలని ప్లాన్ వేసుకున్నారు. మరి ఏటీఎం విప్పాలంటే మాటలా..? దానికోసం ఓ నాలుగు గ్యాస్ సిలిండర్లు, ఓ కట్టర్, మరో గునపం సమకూర్చుకుని ఎంటరైపోయారు. మెయిన్ డోర్, సీసీ కెమెరాలను పగులగొట్టారు. మరి ఏటీఎం మెషీన్ తెరవాలనుకుని శతవిధాలా ప్రయత్నించారు. కానీ వారి తరం కాలేదు. దీంతో చేసేదిలేక తెచ్చుకున్న సామగ్రిని అక్కడే వదిలి పారిపోయారు.
చివరకు బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు. ఆధారాలను సేకరించారు. నిందితుడిని 24 గంటల్లో ట్రాక్ చేసి పట్టుకున్నారు. ప్రసాద్‌తో పాటు అతనికి సహకరించిన రామును కూడా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కునెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అనకాపల్లి సీఐ భాస్కర్ తెలిపారు.
Also Read: