VIRAL VIDEO : డ్యూటీలో ఉన్నప్పుడు వైరల్ వీడియోలు..! ఇద్దరు పోలీసులకు షోకాజ్ నోటీసులు జారీ..

|

Jun 09, 2021 | 8:50 PM

VIRAL VIDEO : కరోనా సమయంలో డ్యూటీలో ఉండి వైరల్ వీడియోలు చేస్తున్న ఇద్దరు ఢిల్లీ పోలీసులకు ఊహించని

VIRAL VIDEO : డ్యూటీలో ఉన్నప్పుడు వైరల్ వీడియోలు..! ఇద్దరు పోలీసులకు షోకాజ్ నోటీసులు జారీ..
Two Delhi Police
Follow us on

VIRAL VIDEO : కరోనా సమయంలో డ్యూటీలో ఉండి వైరల్ వీడియోలు చేస్తున్న ఇద్దరు ఢిల్లీ పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. వారు చేసిన వీడియోలు చూసిన ఉన్నతాధికారులు ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో వారు చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ శశి, కానిస్టేబుల్ వివేక్ మాథుర్ లాక్డౌన్ సమయంలో తమ అధికారిక విధులను నిర్వర్తించేటప్పుడు వైరల్ వీడియోలను చేస్తున్నారు. హిందీ సినిమా పాటలకు వీరు వీడియోలు చేశారు.

ఇదిలా ఉంటే ఈ వీడియోలు యూనిఫాంలో ఉండి చేయడం వారు చేసిన పెద్ద తప్పు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అదే విధంగా ఈ వీడియోలను పోస్ట్ చేశారు. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో జూన్ 7 న డీసీపీ (నార్త్‌వెస్ట్) ఉషా రంగ్నాని వారిద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇంకా నోటీసులో ఇలా రాసారు. ఈ వీడియోలలో కానిస్టేబుల్ వివేక్ మాస్కు కూడా ధరించలేదు ఇద్దరు సామాజిక దూర నిబంధనలను ఉల్లంఘించారు.

బాధ్యతాయుతమైన విధులలో ఉండి నిర్లక్యంగా వ్యవహరించారు. దీంతో ఈ వీడియోలు చూసిన ప్రజలు పోలీసులను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. అయితే షోకాజ్ నోటీసులు జారీచేసినప్పటి నుంచి 15 రోజులలోపు వారు ఈ సంఘటనపై, వీడియోలపై ఉన్నతాధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అది జరగకపోతే క్రమశిక్షణ ఉల్లంఘన కింద వారిని సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది.

Chanakya Niti: ఆచార్య చాణక్య ఇల్లు నిర్మించుకోవాలంటే ఎటువంటి ప్రదేశం.. వాతావరణం ఉండాలని చెప్పారంటే..

Savings Account: మంచి రాబడులు వచ్చేందుకు పెట్టుబడులు.. పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు..!

జైల్లో తనకు స్పెషల్ ఫుడ్ కావాలన్న రెజ్లర్ సుశీల్ కుమార్….ఢిల్లీ కోర్టు ఏం చెప్పిందంటే ….?