దేశాన్ని వణికించిన కతువా కేసు.. అసలేం జరిగింది ?

|

Jun 10, 2019 | 1:22 PM

జమ్మూ కాశ్మీర్ లో ఎనిమిదేళ్ల బాలిక కతువా దారుణ హత్యాచారం దేశంలో పెను సంచలనం రేపింది. కతువా ఏరియాలో నివసించే ముస్లిం నోమాడ్ జాతికి చెందిన నిమ్న వర్గాలను అక్కడినుంచి గెంటివేసేందుకు అగ్రవర్ణాలు పన్నిన ఘాతుకానికి అన్నెంపున్నెం తెలియని ఈ బాలిక బలైపోయింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. గత ఏడాది జనవరి 17 న జమ్మూ దగ్గరి అటవీ ప్రాంతంలో ఈ బాలిక మృత దేహం చిన్నాభిన్నమై కనిపించింది. మూడు రోజుల అనంతరం ఓ మైనర్ […]

దేశాన్ని వణికించిన కతువా కేసు.. అసలేం జరిగింది ?
Follow us on

జమ్మూ కాశ్మీర్ లో ఎనిమిదేళ్ల బాలిక కతువా దారుణ హత్యాచారం దేశంలో పెను సంచలనం రేపింది. కతువా ఏరియాలో నివసించే ముస్లిం నోమాడ్ జాతికి చెందిన నిమ్న వర్గాలను అక్కడినుంచి గెంటివేసేందుకు అగ్రవర్ణాలు పన్నిన ఘాతుకానికి అన్నెంపున్నెం తెలియని ఈ బాలిక బలైపోయింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. గత ఏడాది జనవరి 17 న జమ్మూ దగ్గరి అటవీ ప్రాంతంలో ఈ బాలిక మృత దేహం చిన్నాభిన్నమై కనిపించింది. మూడు రోజుల అనంతరం ఓ మైనర్ బాలుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి దర్యాప్తులో.. మొత్తం 8 మందిలో ఏడుగురిపై రేప్, మర్డర్ కేసులు దాఖలయ్యాయి. ఈ చిన్నారిని దుండగులు కిడ్నాప్ చేసి.. ఓ ఆలయంలో నిర్బంధించి.. వారం రోజుల పాటు ఆహారం పెట్టకుండా నకనకలాడేలా చేశారని, రోజులతరబడి అత్యాచారం చేస్తూ వచ్చారని, చివరకు గొంతు నులిమి హతమార్చి,, పెద్ద బండరాయితో తలను ఛిద్రం చేశారని ఖాకీలు తమ చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రిటైర్డ్ అధికారి సాంజీ రామ్ గత ఏడాది మార్చి 20 న పోలీసులకు లొంగిపోయాడు. ఇతనితో బాటు ఇతని కొడుకు విశాల్, అతని స్నేహితుడు, ఎస్ఐ ఆనంద్ దత్తాను, మరో ఇద్దరు పోలీసు అధికారులైన దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మను అరెస్టు చేశారు. తిలక్ రాజ్ అనే హెడ్ కానిస్టేబుల్, ఆనంద్ దత్తా సాక్ష్యాలను తారుమారు చేయడానికి యత్నించారని పేర్కొన్నారు. నాడు ఆ ప్రాంతంలో బీజేపీకి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీకి మధ్య గల పొత్తును ఈ ఘటన నీరుగార్చింది. ఇద్దరు బీజేపీ నేతలు.. చౌదరీ లాల్ సింగ్, ప్రకాష్ గంగా తమ మద్దతుదారులతో నిందితులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. దీంతో ఇది రాజకీయ రంగును కూడా పులుముకుంది. . అటు-కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లగా.. విచారణ జమ్మూ కాశ్మీర్ బయట జరగాలని అత్యున్నత న్యాయస్ధానం ఆదేశించింది. కతువా కోర్టులోని లాయర్లు… క్రైమ్ బ్రాంచి అధికారులను చార్జిషీటు దాఖలు చేయకుండా అడ్డుకోవడంతో. ఏప్రిల్ 9 న హైడ్రామా నడిచింది. చివరకు ఈ నెల 3 తో పఠాన్ కోట్ కోర్టులో రహస్య విచారణ ముగిసింది. ఈ కేసులో ఆరుగురిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. కతువా కేసు దోషులకు కఠిన శిక్లలు విధించాలని కతువా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.