Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదవశాత్తు జరుగుతున్న ప్రమాదాల వల్ల ఎందరో బలవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రాలో ట్రక్కు – కారు ఢీకొనడంతో 8 మంది దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
అయితే ప్రతి రోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనదారుల నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడం, అజాగ్రత్త, ఓవర్‌టెక్ తదితర కారణాల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు ఏదో ఒక చోటు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరుగకుండా ఇప్పటికే పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నారు. అతివేగంగా వెళ్లే వాహనాలపై కేసులు, చలాన్లు విధిస్తున్నారు.