Telangana: పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన క్రెడిట్ కార్డు బిల్లు.. దంపతుల ఆత్మహత్య..

| Edited By: Balaraju Goud

Feb 17, 2024 | 6:14 PM

మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇరుగు పొరుగు వారు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.

Telangana: పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన క్రెడిట్ కార్డు బిల్లు.. దంపతుల ఆత్మహత్య..
Couple Suicide
Follow us on

మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇరుగు పొరుగు వారు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.

కీసర గ్రామానికి చెందిన సురేశ్‌ కుమార్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల అప్పుల భారం ఎక్కువ కావడంతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పిల్లలను బంధువుల ఇంటికి పంపించి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

సురేష్ స్వస్థలం లాలాపేట్, మారెడ్ పల్లి ప్రాంతానికి చెందిన భాగ్యతో వివాహమైంది. ఇద్దరు పిలలతో కలిసి కీసరలో స్థిరపడ్డారు. ప్రైవేట్ ఉద్యోగం చేసే సురేష్ కుటుంబ భారంతో అప్పులు పెరిగాయి. దీంతో క్రెడిట్ కార్డు ద్వారా మరింత లోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్రెడిట్ కార్డుకు సంబందించిన అధికారులు ఇంటికి వచ్చి బిల్ కట్టమని ఇబ్బంది పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు దంపతులు. స్థానికంగా ఉన్న ఇరుగుపొరుగు వారి ముందు తమ పరువు పోయిందని మానసికంగా కృంగిపోయిన సురేష్ దంపతులు.. ఇద్దరు పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. తమ చావుకి కారణం క్రెడిట్ కార్డ్ అధికారులు అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టిన సురేష్ దంపతులు ప్రాణాలు తీసుకున్నారు..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…