కుక్కకు స్నానం చేయించడానికి వెళ్లి.. గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు..

Godavari river: గోదావరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పెంపుడు కుక్క స్నానం చేయించాడానికి వెళ్లిన ఆ యువకులు

కుక్కకు స్నానం చేయించడానికి వెళ్లి.. గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 02, 2021 | 5:05 AM

Godavari river: గోదావరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పెంపుడు కుక్క స్నానం చేయించడానికి వెళ్లిన ఆ యువకులు తిరాగానిలోకానికి వెళ్లడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం మోతే పట్టీనగర్‌లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల పరిధిలోని రిక్షా కాలనీలో నివాసముంటున్న నిమ్మల వెంకటేశ్వరరావు కుమారుడు నిమ్మల హరిచంద్ (25) తాను పెంచుకుంటున్న పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు తన స్నేహితులైన జమ్మి షణ్ముఖరావు (23), చక్రిలతో కలిసి మోతే పట్టీనగర్‌ పుష్కరఘాట్ సమీపంలో గోదావరి నదిలోకి దిగారు.

కుక్కకు స్నానం చేస్తున్న క్రమంలో అది లోతైన ప్రాంతానికి వెళ్లడంతో దానిని కాపాడే ప్రయత్నంలో హరిచంద్, షణ్ముఖరావు వెళ్లి నీటిలో గల్లంతయ్యారు. గమనించిన చక్రి కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా ఆ ఇద్దరు యువకుల జాడ తెలియరాలేదు. దీంతో రిక్షానగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. Also Read:

Hyderabad: దారుణ హత్య.. శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఎక్కడంటే..?

girl honey trap: విద్యార్థి ప్రాణం తీసిన వీడియోకాల్‌.. కిలాడీ లేడీ వలలో పడి బలవన్మరణం..!

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..