Road Accident: సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా మునగాల మండలం కేంద్రంలో సోమవారం నాడు రోడ్డు ప్రమాదం జరిగింది.
మునగాల మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు.. రోడ్డపై ఆగిఉన్న లారీని వెనకాల నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఇక మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమనే అంచనాకు వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ చివరి వారంలో ఇదే జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు మరణించారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు మునగాల వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి కిందపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు జరగడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read: Wall Collapsed: నిజామాబాద్‌లో విషాదం.. గోడ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం
కరోనాతో పీయూష్ చావ్ల తండ్రి మృతి.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటన.. పలువురి ఆటగాళ్ల సంతాపం..
King Koti Hospital: కింగ్ కోఠి ఆసుపత్రిలో ఎవరూ చనిపోలేదు.. ఆక్సిజన్ అందుబాటులోనే ఉంది: డీఎంఈ