Road Accident: ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఢీకొట్టిన లారీ.. ఇద్దరు యువకులు దుర్మరణం

Bhadradri Kothagudem Road Accident: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బూర్గంపాడు మండలం కృష్టసాగర్ ఎర్రమ్మతల్లి

Road Accident: ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఢీకొట్టిన లారీ.. ఇద్దరు యువకులు దుర్మరణం
Accident

Updated on: Apr 13, 2022 | 9:18 AM

Bhadradri Kothagudem Road Accident: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బూర్గంపాడు మండలం కృష్టసాగర్ ఎర్రమ్మతల్లి ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం బుధవారం ఉదయం (Burgampahad) మణుగూరు క్రాస్ రోడ్ వద్ద జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు అసిఫ్ పాషా(29), భీష్మ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మృతులు ఆశ్వాపురం మండలం అమ్మగారి పల్లి గ్రామానికి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. కొత్తగూడెం నుంచి అశ్వాపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో అమ్మగారి పల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read:

Crime News: దారుణం.. భర్తను చంపేందుకు మాస్టర్ ప్లాన్.. ఆ ఇద్దరితో కలిసి భార్య ఏం చేసిందంటే..

Crime news: జోరుగా క్రికెట్ బెట్టింగ్.. గతంలో అలా, ప్రస్తుతం ఇలా.. పోలీసులు ఏం చేశారంటే