Telangana Crime News: గలీజ్‌గాళ్లు.. ఆన్లైన్ తరగతుల కోసం స్కూల్లో ఏర్పాటు చేసిన టీవీని చోరీ చేశారు..
వికారాబాద్ జిల్లా పరిగి మండలం హీర్యానాయక్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. తాళం విరగ్గొట్టి స్కూల్లో...
వికారాబాద్ జిల్లా పరిగి మండలం హీర్యానాయక్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. తాళం విరగ్గొట్టి స్కూల్‌లో ఉన్న ఎల్ఈడీ టీవీ, సెట్ టాప్ బాక్సులను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఉదయం స్కూల్ శుభ్రం చేసేందుకు వచ్చిన శానిటేషన్ సిబ్బంది.. గది తాళం విరిగి ఉండటం చూసి స్థానిక సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లాడు. పాఠశాలలో చోరీ జరిగిందని గమనించిన టీచర్, సర్పంచ్.. పరిగి పోలీసు స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కోవిడ్ వ్యాప్తి సమయంలో పేద విద్యార్థులు చదువు నుంచి దూరం కావొద్దనే ఉద్దేశంతో.. గతేడాది ఎంపీ రంజిత్ రెడ్డి పరిగి నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఎల్ఈడీ టీవీలను తన సొంత నిధులతో ఇప్పించారు. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన టీవీని దొంగిలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్ షాపింగ్ పెట్టుబడి పేరిట.. లక్షల్లో కాజేశారు..
ఆన్లైన్ షాపింగ్ పెట్టుబడి అంటూ హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన మహిళ నుంచి రూ.2.10 లక్షలు కాజేశారు కేటుగాళ్లు. ఆన్లైన్ షాపింగ్ పెట్టుబడి అంటూ ఫేస్బుక్లో యాడ్ చూసి డబ్బులను పోగొట్టుకున్న ఆదర్శ్ నగర్‌కు చెందిన ఆర్తి ప్రియ పోలీసులను ఆశ్రయించారు. తాము పంపే లింక్ ద్వారా రిజిస్టర్ అయ్యి అందులో పెట్టుబడి పెట్టాలంటూ సైబర్ కేటుగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్ చేశారని తెలిపారు. అది నమ్మి మొత్తం రూ.2.10లక్షలను పలు దఫాలుగా చెల్లించినట్లు వెల్లడించారు. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయని బాధితురాలు అడగగా… మరికొంత నగదు చెల్లిస్తేనే వస్తాయని అన్నారని పేర్కొన్నారు. లేదంటే డబ్బులు రావని మాయచేశారని వాపోయారు.చివరకు మోసపోయానని గ్రహించిన బాధితురాలు బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్‌లో చిక్కుకుని మహిళ మృతి.. క్షమాపణలు చెప్పిన యూపీ పోలీసులు