AOB Bandh : నేడు ఏవోబీ బంద్‌కి పిలుపునిచ్చిన మావోయిస్టులు.. ఏజెన్సీలో హై అలర్ట్.. అడవిని జల్లెడ పడుతున్న బలగాలు..

AOB Bandh : కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జూన్‌ 16న జరిగిన ఎదురుకాల్పులకు నిరసనగా మావోయిస్టులు గురువారం ఏవోబీ బంద్‌కు

AOB Bandh : నేడు ఏవోబీ బంద్‌కి పిలుపునిచ్చిన మావోయిస్టులు..  ఏజెన్సీలో హై అలర్ట్.. అడవిని జల్లెడ పడుతున్న బలగాలు..
Aob Bandh

Updated on: Jul 01, 2021 | 9:51 AM

AOB Bandh : కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జూన్‌ 16న జరిగిన ఎదురుకాల్పులకు నిరసనగా మావోయిస్టులు గురువారం ఏవోబీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టుల మృతిచెందారు. బంద్‌ను విజయవంతం చేయాలని మావోయిస్టులు మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రచారం నిర్వహించినట్టు తెలిసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసు వర్గాలు…ఎక్కడా బంద్‌ ప్రభావం కనిపించ కుండా చేయాలన్న ఉద్దేశంతో చర్యలు చేపట్టారు.

11 మండలాల పోలీస్ స్టేషన్లు అప్రమత్తం చేశారు. సరిహద్దు గ్రామాల్లో గాలింపు చర్యలు నిర్వహిస్తూ, మరోవైపు ప్రధాన కేంద్రాల్లో 24 గంటలూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని మందుపాతరలు అమర్చే అవకాశముందని భావించి, ప్రధాన రహదారులు, వంతెనలు, కల్వర్టుల వద్ద బాంబ్‌ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు.

మావోయిస్టుల బంద్‌ పిలుపుతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను రద్దు చేశారు. పాడేరు నుంచి హుకుంపేట మండలం ఉప్ప, జి.మాడుగుల మండలం మద్దిగరువు, పెదబయలు మండలం బొంగరం, ముంచంగిపుట్టు మండలం కుమడ, చింతపల్లి మండలం మూలకొత్తూరులకు బస్సు సర్వీసులను బుధవారం నుంచే ఆపేశారు. జోలాపుట్టు బస్సులను ముంచంగిపుట్టు వరకు, మంప, జీకేవీధి ప్రాంతాలకు వెళ్లే బస్సులను చింతపల్లి వరకే నడుపుతున్నారు.

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..

Ram Charan: ఆర్ఆర్ఆర్ సెట్ లో చెర్రీతో అంత క్లోజ్‏గా ఉన్న ఆ బుడ్డోడు ఎవరో తెలుసా…?? ( వీడియో )

Rakul Preet Singh: టాలీవుడ్‏ లో బిజీ కానున్న రకుల్.. బాలయ్యకు జోడిగా ఢిల్లీ బ్యూటీ..

Food Oil: సామాన్యులకు భారీ ఊరట.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Gold and Silver Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పసిడి ధరలు.. అదే బాటలో వెండి ధరలు