Friendship Day 2021: స్నేహితుల దినోత్సవం కావడంతో.. వారంతా సరదాగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వెళ్లారు. అనంతరం నీటిలోకి దిగి ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో వరద తాకిడికి ఐదుగురు స్నేహితుల్లో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ విషాధ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బాల్కొండ మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఈ సంఘటన జరిగింది. అర్వపల్లికి చెందిన ఐదుగురు స్నేహితులు ఆదివారం శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వెళ్లారు. ఈ క్రమంలో ఐదుగురు కలిసి స్నానం చేసేందుకు నీటిలో దిగారు. వరద ప్రవాహానికి ఐదుగురు కూడా నీటిలో గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో గమనించిన స్థానికులు అతికష్టం మీద ఇద్దరిని కాపాడారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలు వివరాలు సేకరించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు అర్వపల్లికి చెందిన ఉదయ్, రాహుల్, గట్టు శివగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: