Khammam: సాగర్ కాల్వలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి.. ముగ్గురు గల్లంతు..

|

Dec 20, 2021 | 6:51 AM

Nagarjuna Sagar Canal: వారంతా స్నేహితులు.. పొట్టకూటికోసం వేరే రాష్ట్రం నుంచి వచ్చారు. ఈ క్రమంలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లి.. నీటిలో ముగ్గురు గల్లంతయ్యారు. దీంతో ఆయా

Khammam: సాగర్ కాల్వలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి.. ముగ్గురు గల్లంతు..
Drowned
Follow us on

Nagarjuna Sagar Canal: వారంతా స్నేహితులు.. పొట్టకూటికోసం వేరే రాష్ట్రం నుంచి వచ్చారు. ఈ క్రమంలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లి.. నీటిలో ముగ్గురు గల్లంతయ్యారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్రవిషాాదం నెలకొంది. ఈ సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం వద్ద నాగార్జున సాగర్‌ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. కాలువలో ఈత కొట్టేందుకు ఏడుగురు వెళ్లగా అందులో ముగ్గురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

గల్లంతైన వారంతా కేరళ రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. గల్లైంతన వారు పరకాల్ సోనీ(35), అభయ్(25),వివేక్ (23) గా పోలీసులు గుర్తించారు. గల్లంతయిన ముగ్గురిలో ఇద్దరు ఖమ్మంలోని అభయ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో పని పని చేస్తున్నారు. ఒక వ్యక్తి సూర్యాపేట అభయ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో పని చేస్తున్నాడు.

వీకెండ్ కావడంతో ఏడుగురు సరదాగా ఈత కొట్టేందుకు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎన్ఎస్‌పీ కాల్వలో దిగారు. కాలువలో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండటంతో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Bigg Boss 5 Telugu Winner and Updates: అంబరాన్ని అంటుతున్న సంబరాలు.. రచ్చ రచ్చ చేస్తున్న సన్నీ ఫ్యాన్స్‌..

PM Narendra Modi: సర్దార్ పటేల్ ఇంకొన్నాళ్లు జీవించి ఉంటే.. గోవాకు ఎప్పుడో విముక్తి లభించేది: ప్రధాని మోదీ