ప్రాణాలు తీసిన వాగు..ముగ్గురు పిల్లలు దుర్మరణం

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటామని బయటకు వెళ్లిన కల్మషం తెలియని పిల్లలు..విగత జీవులుగా ఇంటికి తిరిగొచ్చారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాద చాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రమైన రాజోలి గ్రామంలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన ఎంకప్ప కుమారుడు చరణ్‌(7), చాకలి బజారి కుమారుడు శివయ్య(9), ఎల్లప్ప కుమారుడు యుగంధర్‌(6), అదే కాలనీకి చెందిన మధు, వంశీలతో కలసి కాలనీ పక్కనే ఉండే పెద్దవాగు వద్దకు ఆదివారం ఉదయం […]

ప్రాణాలు తీసిన వాగు..ముగ్గురు పిల్లలు దుర్మరణం
Follow us
Ram Naramaneni

| Edited By: Srinu

Updated on: Jun 24, 2019 | 7:18 PM

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటామని బయటకు వెళ్లిన కల్మషం తెలియని పిల్లలు..విగత జీవులుగా ఇంటికి తిరిగొచ్చారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాద చాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రమైన రాజోలి గ్రామంలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన ఎంకప్ప కుమారుడు చరణ్‌(7), చాకలి బజారి కుమారుడు శివయ్య(9), ఎల్లప్ప కుమారుడు యుగంధర్‌(6), అదే కాలనీకి చెందిన మధు, వంశీలతో కలసి కాలనీ పక్కనే ఉండే పెద్దవాగు వద్దకు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఆడుకునేందుకు వెళ్లారు. మధ్యాహ్నం వేళ ఆకలి అవుతోందంటూ భోజనం చేసేందుకు మధు, వంశీ తిరిగి వచ్చారు. మిగిలిన ముగ్గురు పిల్లలూ అక్కడే ఆడుకుంటూ ఉండిపోయారు. మధ్యాహ్నం వరకు పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. తిరిగొచ్చిన పిల్లలతో మాట్లాడారు. తాము వచ్చేశామని, వారు అక్కడే ఉండిపోయారని చెప్పడంతో తల్లిదండ్రులు హుటాహుటిన వాగు వద్ద గాలించారు. వాగులో మనిషిలోతు ఉండే నీటి గుంత సమీపంలోనే పిల్లల చెప్పులు కనిపించాయి. దీంతో అందులో దిగి దాదాపు అరగంట పాటు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. రాత్రి 8గంటల ప్రాంతంలో చివరకు వలవేసి గాలించడంతో మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.