కల్లు కంపౌండ్ మహిళలే అతడి టార్గెట్..! ఇప్పటి వరకు 19 మంది మహిళలపై అత్యాచారం, దోపిడీ..

|

May 14, 2021 | 8:09 AM

Thief Targets Single Women : నగరంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. నేరగాళ్లు కొత్త కొత్త పద్దుతులలో అమాయకులను మోసం

కల్లు కంపౌండ్ మహిళలే అతడి టార్గెట్..! ఇప్పటి వరకు 19 మంది మహిళలపై అత్యాచారం, దోపిడీ..
Thief
Follow us on

Thief Targets Single Women : నగరంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. నేరగాళ్లు కొత్త కొత్త పద్దుతులలో అమాయకులను మోసం చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు. ఎవరైనా క్రైం ఎందుకు చేస్తారు డబ్బు కోసమే, నగల కోసమో చేస్తామని చెబుతారు కానీ ఘట్‌కేసర్‌ నారపల్లికి చెందిన ఈ ఘరానా దొంగ మాత్రం వేరే సమాధానం చెప్పాడు. కేవలం కిక్కు కోసం మాత్రమే చేస్తానని, మూడు, నాలుగు నెలలకు ఒక్కసారి ఇలా చేయకపోతే మజారాదని, రాత్రిపూట నిద్ర పట్టదని అన్నాడు. ఇతడు చెప్పిన మాటలు విన్న పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇంతకు ఇతగాడు చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నారపల్లికి చెందిన హుస్సేన్‌ఖాన్‌ కల్లు కాంపౌండ్ల దగ్గర కనిపించే ఒంటరి మహిళలను బండిపై ఎక్కించుకుని శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక వాంఛ తీర్చుకుని ఆపై నగలతో ఉడాయిస్తాడు. వారికి ఎలాంటి హానీ చేయడు. ఇప్పటివరకు 19 మంది మహిళలను ఈ తరహాలో వంచించినట్లు తెలిసింది. నిందితుడిపై గతంలో పీడీ చట్టాన్ని ప్రయోగించి ఏడాదిపాటు చర్లపల్లి జైలుకు పంపారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నెల ఒకటో తేదీన జిల్లెలగూడలోని కల్లు కాంపౌండ్‌కు వెళ్లిన హుస్సేన్‌ఖాన్‌.. అక్కడో మహిళకు మాయయాటలు చెప్పి పెద్దఅంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ సమీపానికి తీసుకెళ్లాడు. మహిళ నుంచి చెవిదుద్దులు, మాటీలు, నల్లపూసల తాడు, పర్సులోని రూ.2,500 తీసుకున్నాడు. తన లైంగిక వాంఛ తీర్చుకున్నాక అక్కడి నుంచి పరారయ్యాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన హయత్‌నగర్‌ పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా గురువారం పెద్ద అంబర్‌పేటవద్ద హుస్సేన్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మీర్‌పేట, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, ఛత్రీనాక, కంచన్‌బాగ్‌ తదితర ఠాణాల పరిధిలో ఈ తరహా మొత్తం 19 నేరాలనూ తానే చేసినట్లు అంగీకరించాడు. 9 తులాల బంగారం, రూ.45 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా 19 మంది మహిళల్లో ఇద్దరే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేలింది. ‘నేను కేవలం కిక్కు కోసమే చేశా. మూడు, నాలుగు నెలలకోసారి అలా చేయకపోతే నాకు మజా రాదు. నిద్ర పట్టదు’ అని నిందితుడు వెల్లడించడంతో అధికారులు నివ్వెరపోయారు.

Indu Jain: కరోనా మహమ్మారి ధాటికి నేలరాలిన ఆణిముత్యం.. టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ ఇందూ‌జైన్ కన్నుమూత

Parshuram Jayanti 2021: పరశురామ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు.. శుభ సమయం, ప్రాముఖ్యత, చరిత్ర తెలుసుకుందామా..