AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilnadu: సంజయ్‌ మామనే మా డాడీని చంపేశాడు… మూడేళ్ల కూతురు సమాచారంతో బయటపడిన తల్లి ఎఫైర్‌

తమిళనాడులోని వేలూరులో జరిగిన హత్యకేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడేళ్ల కూతురు ఇచ్చిన సమాచారంతో తండ్రి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించినట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం భరత్ అనే వ్యక్తి దారుణ హత్యకు...

Tamilnadu: సంజయ్‌ మామనే మా డాడీని చంపేశాడు... మూడేళ్ల కూతురు సమాచారంతో బయటపడిన తల్లి ఎఫైర్‌
Nandini Sanjay Bharath
K Sammaiah
|

Updated on: Jul 24, 2025 | 9:58 AM

Share

తమిళనాడులోని వేలూరులో జరిగిన హత్యకేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడేళ్ల కూతురు ఇచ్చిన సమాచారంతో తండ్రి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించినట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం భరత్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భార్య, పిల్లలతో బైక్‌పై వెళ్తుండగా కత్తులతో దాడి చేసి చంపేశారు. అయితే పోలీసుల విచారణలో అసలు గుట్టు రట్టయింది. భర్తను భార్య నందిని హత్య చేయించినట్టు నిర్ధారణ అయింది. భార్య నందినిని, ప్రియుడు సంజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వేలూరు జిల్లా ఒడుకత్తూర్‌ వద్ద కుప్పంపాళ్యానికి చెందిన భారత్‌(36) వృత్తిరీత్యా వంట మాస్టర్‌. చెన్నైలోని ఓ హోటల్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో వివాహమైంది. వారికి నాలుగు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారాంతపు సెలవు రోజుల్లో భార్యాపిల్లలను చూసేందుకు భారత్‌ సొంతూరుకు వస్తుంటాడు. ఈ నెల 21న ఇంటికొచ్చాడు. సరుకుల కోసం భార్య, చిన్న కుమార్తెను తీసుకుని బైక్‌పై షాపుకు వెళ్లి సరుకులు కొనుగోలు చేశాడు. ఇంటికి తిరిగి వస్తునన సమయంలో రోడ్డుపై అడ్డంగా కొబ్బరిమట్టలు కనిపించాయి. వాటిని దాటే యత్నంలో అదుపుతప్పి కిందపడిపోయాడు.

అయితే అక్కడే మాటువేసిన ఓ వ్యక్తి కత్తితో భారత్‌పై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. బాధితుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. విచారణలో నందిని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం కలిగింది. భారత్‌ చిన్న కుమార్తెను ఆరా తీయగా.. సంజయ్‌ మామ తన తండ్రిపై దాడి చేసినట్లు పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పింది. దాంతో భార్య నందినిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వ్యవహారమంతా బయటపడింది.

ఎదురింట్లో ఉండే 21 ఏళ్ల సంజయ్‌తో నందిని వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి భారత్‌ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. దీంతో భారత్‌ను హతమార్చేందుకు ఇద్దరూ పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. నిందితులిద్దరినీ పోలీసులు కోర్టులో హాజరుపర్చి, జైలుకు తరలించారు.

Follow Us
పాలు తాగి.. రోజుకు 90 కిలోల బరువు పెరుగుతుంది!
పాలు తాగి.. రోజుకు 90 కిలోల బరువు పెరుగుతుంది!
మీరు కొన్న పనీర్ స్వచ్ఛమైందేనా.. ఈ 5 చిట్కాలతో ఈజీగా తెలుసుకోండి
మీరు కొన్న పనీర్ స్వచ్ఛమైందేనా.. ఈ 5 చిట్కాలతో ఈజీగా తెలుసుకోండి
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..