Hyderabad: అయ్యో..! ప్రాణం తాసిన లుంగీ.. చోరీకి వచ్చి లోపలికి వెళుతుండగా.. అసలేమైందంటే..

Chandrayangutta police station: ఆ వ్యక్తి చోరీ కోసం వచ్చాడు. ఈ క్రమంలో అతను ధరించిన వస్త్రమే యమపాశంగా మారింది. గేటుకు చిక్కుకొని

Hyderabad: అయ్యో..! ప్రాణం తాసిన లుంగీ.. చోరీకి వచ్చి లోపలికి వెళుతుండగా.. అసలేమైందంటే..
Crime News

Updated on: Jan 23, 2022 | 8:07 AM

Chandrayangutta police station: ఆ వ్యక్తి చోరీ కోసం వచ్చాడు. ఈ క్రమంలో అతను ధరించిన వస్త్రమే యమపాశంగా మారింది. గేటుకు చిక్కుకొని లుంగీ బిగుసుకుపోవడంతో చోరీ కోసం వచ్చిన దొంగ చనిపోయాడు. గేటు దూకే క్రమంలో లుంగీ ఉరిలా బిగుసుకుందని.. దీంతో ఊపిరాడక చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బార్కస్‌ జమాల్‌బండ ప్రాంతానికి చెందిన హుస్సేన్‌ బిన్‌ అలీ జైదీ (52) మద్యానికి బానిసై తరచూ దొంగతనాలు చేస్తుండేవాడు.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి దొంగతనం చేయడానికి వెళ్లాడు. శనివారం తెల్లవారుజామున సలాలా పీలిదర్గా రోడ్డులో ఉన్న పాత మోటారు పార్ట్స్ గోదాంలో చోరీకి వెళ్లాడు. ఈ క్రమంలో జైదీ పెద్ద గేటు పైకి ఎక్కి.. దూకుతుండగా అతను కట్టుకున్న లుంగీ గేటుకు చిక్కుకుంది. నడుం వద్ద లుంగీ ముడివేసి ఉండటంతో అది పొట్ట, ఛాతీ భాగం దగ్గర చుట్టుకుపోయింది. దీంతో జైదీ ఊపిరాడక ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు.

అయితే.. శనివారం మధ్యాహ్నం గోదాం సిబ్బంది అక్కడి వెళ్లినప్పుడు గేటుకు మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చంద్రయాణగుట్ట పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Crime News: నడిరోడ్డుపై యువకుడి గొంతు కోసి హతమార్చేందుకు యత్నం.. పోలీసుల ఏంట్రీతో అసలు నిజం..!

Hyderabad: విడాకుల కోసం వచ్చిన మహిళను ట్రాప్ చేసిన లాయర్.. వీడియోలు తీసి.. శారీరకంగా