Marriage: పెళ్లి ఇష్టం లేదని దారుణానికి ఒడిగట్టిన యువతి.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Marriage: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేకుండా

Marriage: పెళ్లి ఇష్టం లేదని దారుణానికి ఒడిగట్టిన యువతి.. ఇంతకీ ఏం జరిగిందంటే..
child marriageImage Credit source: child marriage
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 23, 2022 | 9:52 AM

Marriage: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకారం గ్రామానికి చెందిన లింగయ్య-ముత్తమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. లింగయ్య ఏడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తల్లి ముత్తమ్మ పిల్లలను పెంచిపెద్దచేయడంతో పాటు నలుగురు కుమార్తెలకు వివాహాలు చేసింది. చిన్నకుమార్తె నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆమెకు కూడా వివాహం చేయాలని కుటుంబం నిర్ణయించంది. ఈ క్రమంలో అమ్మాయి వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ పెళ్లి ఆ అమ్మాయికి ఎంతమాత్రమూ ఇష్టం లేదట. విషయం ఇంట్లో వాళ్లకు చెప్పలేక, తనలో తానే బాధపడింది.

అయితే, ప్రస్తుతం కాలేజీకి సెలవులు ఉండటంతో అమ్మాయి ఇంటి వద్దే ఉంటోంది. శనివారం వ్యవసాయ పొలం వద్ద వడ్లు ఎండబోసేందుకు వెళ్లింది. వడ్లు ఎండబోసిన అనంతరం పక్కనే ఉన్న వేపచెట్టుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానిక రైతులు.. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు వెంటనే వ్యవసాక్షేత్రం వద్దకు వెళ్లి ఉరితాడుకు వేళాడుతున్న అమ్మాయి మృతదేహాన్ని కిందకు దించారు. యువతి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also read:

Harish Shankar : ‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి  పిండేశావ్’.. హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్

Priyamani: సెకండ్ ఇన్నింగ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ‘ప్రియమణి’ ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Telangana: అక్కడ జీలుగు కల్లుకు యమ డిమాండ్.. ఏకంగా సీసా రూ.500.. ముందు బుక్ చేసుకుంటేనే

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!