Hyderabad: బంజారాహిల్స్‌ రోడ్డు ప్రమాదానికి కారణం అదే… పోలీసుల అదుపులో బీటెక్‌ విద్యార్థులు..

కొత్తేడాదిలో విషాదాన్ని నింపిన బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెల్లవారు జామున టిఫిన్‌ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను అతివేగం మింగేసింది. న్యూఇయర్‌ వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళుతోన్న సమయంలో ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్ నుంచి..

Hyderabad: బంజారాహిల్స్‌ రోడ్డు ప్రమాదానికి కారణం అదే... పోలీసుల అదుపులో బీటెక్‌ విద్యార్థులు..
Banjarahills Accident

Updated on: Jan 01, 2023 | 1:52 PM

కొత్తేడాదిలో విషాదాన్ని నింపిన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెల్లవారు జామున టిఫిన్‌ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను అతివేగం మింగేసింది. న్యూఇయర్‌ వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళుతోన్న సమయంలో ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్లే ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. విద్యానగర్‌కు చెందిన ప్రణవ్‌, వర్ధన్ సెలీరియో కారులో హైస్పీడ్‌లో దూసుకొచ్చారు. ఓ మలుపు దగ్గర కారును అదుపుచేయలేక రోడ్డు పక్కన నడిచే పాదచారులను.. అక్కడే ఉన్న మరో రెండు కార్లను బలంగా ఢీకొట్టారు.

దీంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. కార్లలో ఉన్న మరో నలుగురు గాయపడ్డారు. కారుని ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసింది ప్రణవ్‌గా గుర్తించారు. అతడితోపాటు స్నేహితుడు వర్ధన్‌ కూడా మద్యం సేవించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఉదయం 5 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు నడిపిన వ్యక్తి విద్య నగర్‌కు చెందిన ప్రణవ్‌గా (23) గుర్తించారు. గాయపడిన వారిని వెల్నేస్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ప్రణవ్‌, వర్ధన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణవ్, వర్ధన్‌లు మణిపాల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..