Andhra Pradesh: వైద్యం చేయించలేను.. నా కుమారుడిని చంపేయండి.. కోర్టును ఆశ్రయించిన తల్లి
నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డ ఓ వైపు.. అతనిని వేధిస్తున్న బిడ్డ అనారోగ్యం మరోవైపు.. అంతులేని ఆవేదన ఇది, భరించలేని బాధ ఇది, నవమాసాలు మోసి కని పెంచిన తల్లే తన బిడ్డ ప్రాణం తీసేయండి అంటూ వేడుకుంటోంది. గుండె తరుక్కుపోయే ఈ...
నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డ ఓ వైపు.. అతనిని వేధిస్తున్న బిడ్డ అనారోగ్యం మరోవైపు.. అంతులేని ఆవేదన ఇది, భరించలేని బాధ ఇది, నవమాసాలు మోసి కని పెంచిన తల్లే తన బిడ్డ ప్రాణం తీసేయండి అంటూ వేడుకుంటోంది. గుండె తరుక్కుపోయే ఈ కన్నీటి గాథ అన్నమయ్య (Annamayya) జిల్లాలో కనిపించింది. నా బిడ్డను ఇంకా పోషించలేను, నా దగ్గర డబ్బు లేదు, పూట గడవడం కూడా కష్టంగా ఉంది దయచేసి కారుణ్య మరణానికి పర్మిషన్ ఇవ్వండి అంటూ మదనపల్లి కోర్టులో కారుణ్య మరణానికి పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాకు చెందిన నౌహీరా.. తన కుమారుడితో కలిసి నివాసముంటోంది. కుమారుడు మున్నీర్ బాషాకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. వైద్యం కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. అయినా అతని హెల్త్ కండీషన్ మెరుగుపడలేదు. కిడ్నీ మార్పు చేస్తే ఫలితం ఉంటుందని వైద్యులు చెప్పడంతో ఎలాగైనా కొడుకును బతికించుకోవాలని తన కిడ్నీ ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే ఆ చికిత్సకు రూ.40లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో చేసేదేమీ లేక మదనపల్లి కోర్టును ఆశ్రయించింది.
తన బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి లేదా కిడ్నీ ఆపరేషన్ చేయించండి అంటూ మదనపల్లి రెండో అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్‌ను కలవాలని సూచించారు. తన కుమారుడి చికిత్సకు సహాయం చేయాలని, దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని ఆమె కంటతడి పెడుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..