Chandanagar: చందానగర్‌లో అరాచకం.. మంచినీళ్లు కావాలంటూ లోపలికి ప్రవేశించి..

హైదరాబాద్ చందానగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మంచినీళ్లు కావాలంటూ లోపలికి ప్రవేశించి అరాచకం చేశారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంటిపై కట్టేసి ఇళ్లు గుళ్ల..

Chandanagar: చందానగర్‌లో అరాచకం.. మంచినీళ్లు కావాలంటూ లోపలికి ప్రవేశించి..
Chandanagar T
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 31, 2021 | 3:44 PM

Chandanagar: హైదరాబాద్ చందానగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మంచినీళ్లు కావాలంటూ లోపలికి ప్రవేశించి అరాచకం చేశారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంటిలోకి ప్రవేశించి కుర్చీలో కట్టేసి ఇళ్లు గుళ్ల చేసి వదిలిపెట్టారు అగంతకులు. వివారాల్లోకి వెళితే, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుడా కాలనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్రీహర్ష నివాసం ఉంటున్నారు. శ్రీహర్ష ఇంట్లోకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మంచినీళ్లు కావాలని అడిగి లోపలికి ప్రవేశించారు.

శ్రీహర్ష పై దాడి చేసి, చైర్ లో కట్టిపడేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లో ఉన్న నగదు, మొబైల్ ఫోన్లు, ఏటీఎం కార్డులు దొచుకెళ్ళారు దుండగులు. అరిస్తే చంపేస్తామంటూ బెదిరించి పరారయ్యారు.

అనంతరం తేరుకున్న బాధితులు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఎవరో పక్కా స్కెచ్ వేసుకొని దోపిడీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

Chandanagar Theft

గుండెపోటు కాదు.. కట్టుకున్న భార్యే కడతేర్చింది.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో అటెండర్‌ వాసు అనుమానాస్పద మృతి కేసులు పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భార్యే అతన్ని అత్యంత కిరాతకంగా చంపేసిందని తేల్చారు. గుండెపోటుతో చనిపోయాడంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదు పూర్తి అవాస్తమవమని నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో వాసు, తన భార్య స్వప్నప్రియ నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు వినయ్ ఉన్నాడు. కొడుకు ఊర్లోనే ఉంటున్నాడు.

కాగా, వాసు జిల్లా కలెక్టరేట్‌లో అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, స్వప్నప్రియ.. మణిగండన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఇది తెలిసిన వాసు పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. దీంతో ఎలాగైనా అతన్ని అడ్డుతొలగించుకోవాలని భావించిన స్వప్నప్రియ.. ప్రియుడు మణి గండన్‌తో కలిసి వాసు హత్యకు ప్రణాళికలు రచించింది. పథకం ప్రకారం అప్పటికే ఇంట్లో రెడీగా ఉన్న మణి గండన్, స్వప్న ప్రియ.. వాసు రాగానే అటాక్ చేశారు. అతని మెడకు సెల్ ఫోన్ ఛార్జింగ్‌ వైర్‌ బిగించి ఊపిరి ఆడకుండా చేశారు. అత్యంత కిరాతకంగా చంపేశారు.

అయితే, వాసును చంపేసిన స్వప్నప్రియ.. తన భర్త వాసు గుండెపోటుతో మరణించాడంటూ కొడుకు వినయ్ కుమార్, బంధువులకు సమాచారం చేరవేసింది. మృతదేహాన్ని నేరుగా స్వగ్రామమైన అరిగిలవారి పల్లెకు తరలించింది. అయితే, తండ్రి వాసు మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కొడుకు వినయ్.. చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసును చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించగా.. విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్త వాసుని హత్య చేయాలని భార్య స్వప్న ప్రియ పథకం ప్రకారం కుట్ర పన్నిందని పోలీసులు నిర్థారించుకున్నారు. ముందుగా వేసిన పథకం ప్రకారం.. ప్రియుడు మణిగండన్‌తో కలిసి భర్త వాసును చంపేసిందని తేల్చారు. వాసును చంపిన భార్య స్వప్నప్రియ, ఆమె ప్రియుడు మణి గండన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read also: Flower don’t die: వికసించిన పువ్వు ఎల్లకాలం అలానే.. అదే అందంతో ఉంటే..! ఇలా చేస్తే సరి.!

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!