లాక్‌డౌన్ ముగిసింది. రెడ్ శాండల్ స్మగ్లర్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. తమ దందాను మొదలు పెట్టారు. చిత్తూరు శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనాన్ని భారీగా ఎక్స్‌పోర్ట్ చేసేందుకు వ్యూహం రచించారు. కాని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్మగ్లర్ల డంప్‌పై దాడులు నిర్వహించి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
సదాశివకోన అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన నాలుగున్నర టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనపరచుకున్నారు. 348 ఎర్రచందనం దుంగలు దాచిపెట్టిన డంప్ ను గుర్తించారు. రెండ్రోజులపాటు అడవిలోనే మకాం పెట్టి డంప్ ను గుర్తించారు.
సదాశివ కోన అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ చేపట్టిన కూంబింగ్, పట్టుబడ్డ ఎర్రచందనం డంప్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు…