AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Broke: బాణాసంచా తయారీ కర్మాగారంలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురికి సీరియస్!

తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Fire Broke: బాణాసంచా తయారీ కర్మాగారంలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురికి సీరియస్!
Fire
Balaraju Goud
|

Updated on: Jan 30, 2022 | 8:28 AM

Share

Tamil Nadu Fire Broke: తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విరుదునగర్ జిల్లా(Virudhunagar District)లోని బాణాసంచా తయారీ కేంద్రం(Fireworks Manufacturing Unit)లో మరోసారి పేలుళ్లు జరిగాయి. టపాసుల కేంద్రంలో పెద్ద శబ్ధంతో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి భవనం నేలమట్టమైంది. బాణాసంచా తయారుచేస్తున్న ఇద్దరు సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. మందుగుండు సామాగ్రిని నిలువచేస్తుండగా జరిగిన ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.జ

తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.

ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించి ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

ఈ నెల ప్రారంభంలోనూ విరుదునగర్ జిల్లా సమీపంలోని ఒక బాణసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన జిల్లాలోని శివకాశి సమీపంలోని మెట్టుపాటి గ్రామంలో చోటుచేసుకుంది. ఒక బాణసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించిన తరువాత అనేక సార్లు పేలుళ్లు సంభవించాయి. వీటిలో కనీసం ఏడు గోడౌన్లు, బాణాసంచా తయారీ షెడ్లు కూలిపోయాయి.

Read Also…  Police Command Centre: హైదరాబాద్‌లో మరో మణిహారం.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్!

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై