ఆన్‌లైన్ గేమ్. అది కూడా రమ్మీ. కాయ్ రాజా కాయ్ అంటూ ఊరించారు. ఉసురు తీశారు. తమిళనాడులో ఓ నిండు కుటుంబం బలైపోయింది. ఆన్‌లైన్ రమ్మీకి, ట్రేడింగ్‌కు అలవాటుపడిన మోహన్ అనే వ్యక్తి.. క్రమంగా బానిసైపోయాడు. ఉన్నదంతా ఊడ్చిపెట్టి.. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పుల ఊబి నుంచి బయటపడే దారి లేదని భావించిన అతను.. కన్నతల్లికి, కట్టుకున్న భార్యకు, పదేళ్ల కూతురికి విషమిచ్చి చంపేశాడు. ఆ తర్వాత అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాదం తమిళనాడులోని హోసూర్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో మోహన్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఇతనికి తల్లి వసంత (61), భార్య రమ్య (36), కొడుకు అన్వయ్ (10) ఉన్నారు. అయితే…మోహన్ కు ఆన్ లైన్‌లో గేమ్స్ ఆడడం వ్యసనం మారింది. ఎప్పుడూ రమ్మీ ఆడుతూ ఉండేవాడు. తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో… సన్నిహితులు, తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకువచ్చి మరీ గేమ్ ఆడాడు . ఇలా లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. అందులో పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడం, అప్పు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి పెరగడంతో మెంటల్‌గా డిస్టబ్ అయ్యాడు. ఆగస్టు 6వ తేదీ శుక్రవారం తల్లి, భార్య, కొడుకులు పురుగుల మందు ఇచ్చి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దు..ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు ఎంత చెబుతున్నా కొందరు పెడచెవినా పెడుతున్నారు. ఆన్ లైన్ గేమ్స్ ఉచ్చులో పడి లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఫలితంగా అప్పులు ఇచ్చినవారి నుంచి ఒత్తిడి అధికం కావడంతో తనువు చాలిస్తున్నారు.
Also Read: పైనుంచి చూస్తే పక్కా పైనాపిల్ లోడే అనుకుంటారు.. లోపల చెక్ చేస్తే మైండ్ బ్లాంక్