Police Constable Selfie Video Viral: అనంతపురం జిల్లాలో ఓ పోలీసు సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక పోలీసు కానిస్టేబుల్ బలవన్మరణానికి ప్రయత్నించాడు. తాడిపత్రి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గణేష్ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనకు కరోనా వచ్చినా కూడా డ్యూటీ చేయించారని గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తనకు ఆరోగ్యం పూర్తిగా విషమించిందని వీడియో ద్వారా పేర్కొన్నాడు. తనకు ఏదైనా జరిగితే రూరల్ ఎస్సై ఖాజా హుస్సేన్ బాధ్యత వహించాలన్నారు. ఆంబులెన్స్‌లో వెళ్తూ ఈ సెల్ఫీ వీడియో తీసి వైరల్ చేశాడు కానిస్టేబుల్ గణేష్. ప్రస్తుతం గణేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబందించి పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
Read Also… మాస్క్ లేకుండా క్రికెట్ ఆడిన యువకుడి అరెస్ట్, బెయిల్ తిరస్కరించిన సెషన్స్ కోర్టు