Terrorist Arrest: బెంగుళూరులో ఉగ్ర కలకలం.. అనుమానిత లష్కరే తోయిబా టెర్రరిస్ట్ అరెస్ట్

Terrorist Arrested: బెంగళూరులో ఉగ్ర కలకలం రేపుతోంది. సెంట్రల్ క్రైమ్‌ బ్రాంచ్‌ (CCB) స్పెషల్‌ వింగ్‌, అంతర్గత విభాగం (ISD), ఇంటెలిజెన్స్‌ వింగ్‌ల సమన్వయంతో టిలక్‌నగర్‌లోని..

Terrorist Arrest: బెంగుళూరులో ఉగ్ర కలకలం.. అనుమానిత లష్కరే తోయిబా టెర్రరిస్ట్ అరెస్ట్

Updated on: Jul 25, 2022 | 11:56 AM

Terrorist Arrested: బెంగళూరులో ఉగ్ర కలకలం రేపుతోంది. సెంట్రల్ క్రైమ్‌ బ్రాంచ్‌ (CCB) స్పెషల్‌ వింగ్‌, అంతర్గత విభాగం (ISD), ఇంటెలిజెన్స్‌ వింగ్‌ల సమన్వయంతో టిలక్‌నగర్‌లోని ఓ నివసాంపై రాత్రి దాడి చేశారు. ఇదే ప్రాంతం సమీపంలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేసి ఇతరులతో కలిసి నివాసం ఉంటున్న అసోంకు చెందిన అక్తర్ హుస్సేన్ లష్కర్ అనే అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతనితో పాటు మరో నలుగురిని కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఈ కేసుకు సంబంధించి బెంగళూరు పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం అదుపులో తీసుకున్నవారిని పోలీసులు విచారిస్తున్నారు.

గత నెలలో నగరంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న తాలిబ్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారు ఇంకా ఎవరెవరితో సంబంధాలున్నాయి.. ఏవైనా ఘటనలకు పాల్పడుతున్నారా..?అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి