Student killed by scorpion bite: స్కూలుకు వెళ్లొస్తానమ్మా అంటూ ఓ బాలుడు ఇంటినుంచి వెళ్లాడు. ఆ ఇంట అవే చివరి మాటలుగా మారాయి. పాఠశాలకు వెళ్లిన బాలుడికి తేలు కాటేయ్యడంతో మృతిచెందాడు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడు ఎస్సీ ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సత్యాల శ్యాంప్రసాద్ దంపతులకు ఆభిషేక్ (11)తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అభిషేక్ స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. గురువారం ఇంటినుంచి పాఠశాలకు వెళ్లిన అభిషేక్ మధ్యాహ్న సమయంలో పాఠశాలలోని మరుగుదొడ్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఎడమ చేతికి తేలు కాటు వేసింది.
తెలు కాటేసిన ఘటన గురించి తెలుసుకున్న ఉపాధ్యాయులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం కుటుంబసభ్యులు అనంతసాగరంలో ప్రాధమిక చికిత్స చేసి ఆత్మకూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అయితే.. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా అభిషేక్ మార్గమధ్యంలో మృతి చెందారు. కాగా ఒక్కగానొక్క కుమారుడుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.
Also Read: