స్టీల్ వ్యాపారి రాం ప్రసాద్ హత్య వెనుక..?
పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగిన వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. డీజీపీ మహేందర్ రెడ్డి, కమిషనర్ అంజనీకుమార్ రెండు గంటలపాటు ఈ హత్య గురించి అధికారులతో చర్చించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు సుపారీ గ్యాంగ్‌తో రాం ప్రసాద్‌ను హత్య చేయించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రాంప్రసాద్ హత్యకు బెజవాడ రౌడీషీటర్ కోగంటి సత్యమే కారణమని చెబుతున్నారు. రాంప్రసాద్, కోగంటి సత్యంలు కలిసి విజయవాడలో కామాక్షి స్టీల్ […]
పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగిన వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. డీజీపీ మహేందర్ రెడ్డి, కమిషనర్ అంజనీకుమార్ రెండు గంటలపాటు ఈ హత్య గురించి అధికారులతో చర్చించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు సుపారీ గ్యాంగ్‌తో రాం ప్రసాద్‌ను హత్య చేయించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రాంప్రసాద్ హత్యకు బెజవాడ రౌడీషీటర్ కోగంటి సత్యమే కారణమని చెబుతున్నారు. రాంప్రసాద్, కోగంటి సత్యంలు కలిసి విజయవాడలో కామాక్షి స్టీల్ ఫ్యాక్టరీని నడిపించేవారని.. అయితే ఈ ఫ్యాక్టరీ విషయంలో ఇద్దరి మధ్య తగాదాలు వచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాం ప్రసాద్‌ను హత్య చేయించి వుంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాం ప్రసాద్ హత్య వెనుక కొందరు రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక కొండపల్లిలోని కామాక్షి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యవహారాలు కృష్ణారెడ్డి చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కేసు విచారణకు సంబంధించిన కోగంటి అల్లుడు కృష్ణారెడ్డికి పంజాగుట్ట పోలీసులు విట్ నెస్ నోటీసులు ఇచ్చారు.