వ్యాపారి ఫైజన్ ఆత్మహత్య కేసులో న్యూ ట్విస్ట్..

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై బెంజ్ కారులో వచ్చి గన్‌తో కాల్చుకుని చనిపోయిన వ్యాపారి ఫైజన్ అహ్మద్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. రెండ్రోజుల క్రితం తుపాకితో కాల్పుకుని గచ్చిబౌలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫైజన్ మృతి చెందాడు. అయితే ఫైజన్ చనిపోవడానికి ఉపయోగించిన తుపాకిని నెల రోజుల క్రితమే మధ్యప్రదేశ్ నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాని అతని భార్య మాత్రం తన భర్త దగ్గర గన్ లేదని.. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు […]

వ్యాపారి ఫైజన్ ఆత్మహత్య కేసులో న్యూ ట్విస్ట్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 08, 2019 | 12:24 PM

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై బెంజ్ కారులో వచ్చి గన్‌తో కాల్చుకుని చనిపోయిన వ్యాపారి ఫైజన్ అహ్మద్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. రెండ్రోజుల క్రితం తుపాకితో కాల్పుకుని గచ్చిబౌలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫైజన్ మృతి చెందాడు. అయితే ఫైజన్ చనిపోవడానికి ఉపయోగించిన తుపాకిని నెల రోజుల క్రితమే మధ్యప్రదేశ్ నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాని అతని భార్య మాత్రం తన భర్త దగ్గర గన్ లేదని.. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని నార్సింగి పోలీసులకు తెలిపింది.

అప్పుల ఊబిలో కూరుకుపోయి.. బాకీ అప్పులు చెల్లించమని ఒత్తిడి పెరగడం వల్లే ఫైజన్ అహ్మద్ సూసైడ్ చేసుకుని ఉంటాడని పోలీసులు భావించారు. కాని ఫైజన్ భార్య మాత్రం తన భర్త రూ. 3 కోట్లకు సంబంధించిన డీల్ మాట్లాడేందుకు వెళ్లాడని.. ఆ క్రమంలోనే అతడ్ని ఎవరో హత్య చేసి ఉంటారని చెబుతోంది. పైజన్ చినిపోవడం వెనుక ఎవరి హస్తమో ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఫైజన్ చనిపోయే ముందు ఫోన్‌లో ఎవరితో మాట్లాడాడా..? ఎవరి దగ్గర అప్పులు చేశాడు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.