తాగుడుకోసం తల్లినే చంపేశాడు..
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంలో ఓ దుర్మార్గుడు కన్న తల్లినే కడతేర్చాడు. మద్యానికి బానిసైన కొడుకును మార్చుకోవాలని ఎంతో ప్రయత్నించిన తల్లి .. అదే కొడుకు చేతిలో బలైపోయింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం జరిగింది. ఢిల్లీ మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య స్ధానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం .. మృతురాలు ఆశాదేవి విజయ్‌నగర్ ప్రాంతంలో ఇళ్లలో పనిచేసుకుని ఉపాధి పొందుతోంది. ఆమెకు […]
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంలో ఓ దుర్మార్గుడు కన్న తల్లినే కడతేర్చాడు. మద్యానికి బానిసైన కొడుకును మార్చుకోవాలని ఎంతో ప్రయత్నించిన తల్లి .. అదే కొడుకు చేతిలో బలైపోయింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం జరిగింది. ఢిల్లీ మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య స్ధానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం .. మృతురాలు ఆశాదేవి విజయ్‌నగర్ ప్రాంతంలో ఇళ్లలో పనిచేసుకుని ఉపాధి పొందుతోంది. ఆమెకు ముగ్గురు కొడుకులు. వీరిలో దీపక్( 25) పెళ్లి బ్యాండ్ గ్రూపులో పనిచేస్తుంటాడు. ఇతడు పూర్తిగా మద్యానికి బానిసగా మారడంతో.. తాగేందుకు డబ్బులు ఇవ్వాలని ప్రతిరోజు తల్లి ఆశాదేవితో గొడవ పడేవాడు. ఆదివారం కూడా ఎప్పటిలాగే మద్యం కోసం డబ్బులివ్వాలని డిమాండ్ చేశాడు. అయితే దీపక్ మాటల్ని పట్టించుకోని తల్లి .. తాగుడు వ్యసనాన్ని మానుకోవాలని తిట్టింది. దీంతో తీవ్ర ఆగ్రహానికిలోనైన దీపక్ .. కన్నతల్లి అని కూడా చూడకుండా కత్తితో పలుమార్లు విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు.
తల్లిని చంపిన కొద్దిసేపటి తర్వాత నేరుగా మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు దీపక్. అక్కడ పోలీసులకు తన తల్లిని కత్తితో పొడిచి చంపినట్టుగా చెప్పాడు. అప్పటికే తాగి ఉన్నందున పోలీసులు అతడి మాటల్ని పట్టించుకోలేదు. అయితే అతడి వస్త్రాలపై రక్తపు మరకలు ఉండటంతో వారికి అనుమానం కలిగింది. వెంటనే విజయ్‌నగర్‌లో అతడి ఇంటికి వచ్చి చూశారు. అక్కడ దీపక్ తల్లి ఆశాదేవి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే దీపక్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.