పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయిన శ్యామ్ అతని అనుచరులు
పంజాగుట్టలో శనివారం హత్యకు గురైన కృష్ణా జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త రాం ప్రసాద్ హత్యకేసు మరో మలుపు తిరిగింది. ఈ హత్యకు మృతుడి బావమరిది ఊర శ్రీనివాస్ కారణమని, అతడు చెప్పడం వల్లే తాము హత్య చేశామని ముగ్గురు వ్యక్తులు టీవీ9తో చెప్పారు. రాం ప్రసాద్‌ను హత్యచేస్తే తనకు డబ్బులు వస్తాయనే ఇలా చేశానని, ఈ హత్యకు కోగంటి సత్యంకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడకు చెందిన శ్యామ్ అంటున్నాడు. తన సొంత బొలెరో కారులో తన […]
పంజాగుట్టలో శనివారం హత్యకు గురైన కృష్ణా జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త రాం ప్రసాద్ హత్యకేసు మరో మలుపు తిరిగింది. ఈ హత్యకు మృతుడి బావమరిది ఊర శ్రీనివాస్ కారణమని, అతడు చెప్పడం వల్లే తాము హత్య చేశామని ముగ్గురు వ్యక్తులు టీవీ9తో చెప్పారు. రాం ప్రసాద్‌ను హత్యచేస్తే తనకు డబ్బులు వస్తాయనే ఇలా చేశానని, ఈ హత్యకు కోగంటి సత్యంకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడకు చెందిన శ్యామ్ అంటున్నాడు. తన సొంత బొలెరో కారులో తన శిష్యులు చోటు, రమేశ్‌ల సహకారంతో ఈ హత్య చేశానని చెబుతున్నాడు.
అయితే తాము చంపిన రాం ప్రసాద్, ఊర శ్రీనివాస్‌లకు గతంలో ఆర్ధిక పరమైన గొడవలున్నాయని, ఈ నేపధ్యంలో రాం ప్రసాద్‌ను చంపితే తనకు డబ్బులిస్తానని ఊర శ్రీనివాస్ తనతో చెప్పాడని నిందితుడు శ్యామ్.. టీవీ9కు చెప్పాడు. పంజాగుట్టలో చంపడానికి కూడా ఊర శ్రీనివాసే కారణమని, అతడు చెప్పడం వల్లే తమకు ఈ అడ్రస్ తెలిసిందన్నాడు.
ఈ హత్యకు మూడు కత్తుల్ని ఉపయోగించామని, వాటిని తన సొంత వాటర్ ప్లాంట్‌లోనే తయారుచేయించానని , తాము ప్రయాణించిన బొలెరో కారు కూడా తనదేనని తెలిపాడు నిందితుడు శ్యామ్. మరోవైపు హత్యలో శ్యామ్‌తో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా శ్యామ్ రమ్మంటే వచ్చామని, మా లైఫ్ సెటిల్ చేస్తానని మాటివ్వడంతోనే ఈ మర్డర్‌కు పాల్పడ్డామని తెలిపారు. పంజాగుట్ట పోలీసుల ముందు ముగ్గురు నిందితులు లొంగిపోయారు.
ఇదిలా ఉంటే .. అసలు శ్యామ్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని టీవీ9తో చెప్పాడు రాం ప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్, ఈ హత్యలో తన ప్రమేయముంటే దర్యాప్తులో వెల్లడవుతుందన్నాడు. రాం ప్రసాద్‌ను చంపాల్సిన అవసరం తనకు లేదని, తన బావను ఎందుకు చంపుకుంటానన్నాడు శ్రీనివాస్.