Drug smuggling: ఎన్నో ఆశలతో ఇంజినీరింగ్ విద్య కోసం చెన్నైకి వెళ్లింది శ్రీకాళంకు చెందిన ఓ యువతి. అనుకున్నట్లే చదువును పూర్తి చేసుకుంది, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంది. అయితే ప్రియుడు చెప్పిన మాటలు విని దారి తప్పింది. ఇప్పుడు అరెస్ట్ అయ్యి పోలీసుల అదుపులో ఉంది. క్రైమ్ కథా చిత్రాన్ని తలపిస్తోన్న ఈ వ్యవహారానికి సంబంధిచిన పూర్తివివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంకు చెందిన రేణుక అలియాస్ ఆద్య (25) అనే యువతి బీటెక్ చేయడానికి చెన్నై వెళ్లింది. ఇదే సమయంలో ఆమె సిద్ధార్థ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. చదువు పూర్తికాగానే రేణుక ఉద్యోగం సంపాదించుకుంది. సిద్ధార్థ్ మాత్రం డ్రగ్స్ పెడ్లర్‌గా మారాడు. ఉద్యోగం ద్వారా వచ్చే జీతం సరిపోవట్లేదని భావించిన రేణుక.. సిద్ధార్థ్‌తో కలిసి డ్రగ్స్ వ్యాపారంలోకి దిగాలని భావించింది. ఇందుకు అనుగుణంగానే రేణుక గతవారం.. బెంగళూరులోని ఓ ప్రాంతంలో ఉన్న హోటల్‌లో రూమ్ బుక్ చేసింది. ఒడిశా నుంచి వచ్చిన గంజాయిని రేణుకకు సిద్ధార్థ్ అందించాడు. ఈ డ్రగ్స్‌ను బెంగళూరులో అమ్మాలని వారి ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలోనే న్యూ బెల్ రోడ్‌లోని ఐఐటీ పార్క్ వద్ద రేణుక గంజాయిని అమ్మేందుకు ప్రయత్నించింది. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. 2.5 కిలోల గంజాయిని, రూ.6500 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన బీహార్‌కు చెందిన సుధాంశును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: తమిళనాట శశికళ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ..? తాజా ఆడియో క్లిప్ లో ఆమె ఏమన్నారంటే ..?
Mosagallu Movie: ఓటీటీలోకి మంచు విష్ణు ‘మోసగాళ్లు’.. ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ..