ఆలయం గాలి గోపురానికి రంధ్రం చేసి పురాతన నాణేల చోరి.. పోలీసులు విచారణలో తేలింది ఏంటంటే..?
దేవాలయాలపై ఇప్పుడు మరో కొత్తరకం విధ్వంసాలకు పాల్పడుతున్నారు దుండగలు. సిక్కోలు జిల్లాలో పురాతన దేవాలయాల గాలిగోపురాల్లో ఆనాటి నాణాలు నిక్షిప్తం చేయబడి ఉంటాయని...

దేవాలయాలపై ఇప్పుడు మరో కొత్తరకం విధ్వంసాలకు పాల్పడుతున్నారు దుండగలు. సిక్కోలు జిల్లాలో పురాతన దేవాలయాల గాలిగోపురాల్లో ఆనాటి నాణాలు నిక్షిప్తం చేయబడి ఉంటాయని, ఆ నాణేలకు మంచి గిరాకీ మార్కెట్‌లో ఉందని తెలుసుకున్న ఓ ముఠా అటువంటి దేవాలయాలని టార్గెట్ చేసింది. గాలిగోపురం శిఖరాలను పగల గొట్టి అందులోని నాణేలను దోచుకున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి పురాతన నాణేలను స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా హిరమండలం కోమనపల్లిలోని కాశీవిశ్వేశ్వర ఆలయంలో జనవరి 23న గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని గాలి గోపురానికి రంధ్రం చేసి దొంగతనం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు వారం రోజుల వ్యవధిలోనే చోరీ మిస్టరీని చేధించారు. దర్యాప్తులో ఒడిశాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 50 పురాతన నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఆ నాణేలు మహిమ గల, శక్తివంతమైన నాణేలని ప్రజలను నమ్మబలికి ఎక్కువ ధరకు అమ్మి కొందర్ని మోసం చేస్తున్నారని పోలీసులు తేల్చారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. మాయ మాటలు చెప్పే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మొత్తానికి ఎలాంటి మత విద్వేశాలకు తావు లేకుండా ఈ ఘటనలో వాస్తవలు తేలడంతో పోలీస్ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
Also Read: