Srikakulam: శ్రీకాకుళం పట్టణంలో కలకలం..తొమ్మిది సెంట్ల భూమి కోసం అత్తను చంపిన అల్లుడు
శ్రీకాకుళం పట్టణంలో ఓ ప్రబుద్ధుడు తన అత్తను క్రూరంగా చంపేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం పట్టణంలో ఓ ప్రబుద్ధుడు తన అత్తను క్రూరంగా చంపేశాడు. శ్రీకాకుళంలోని బలగ కుమ్మరివీధిలో నివాసం ఉంటున్న 65 సంవత్సరాల నక్క అమ్మాయమ్మను ఆమె అల్లుడు చిట్టి ప్రసాద్ రోకలిబండతో బాది చంపేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు అమ్మాయమ్మ స్వస్థలం ఎచ్చెర్ల మండలం పెద్దకొంగరాం గ్రామం. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెను శ్రీకాకుళానికి చెందిన చిట్టిప్రసాద్ (ఆమెకు సోదరుడు) కు ఇచ్చి 1990 లో వివాహం చేసింది. పెళ్లి చేసే సమయంలో అల్లుడికి కట్నంగా 33 సెంట్ల భూమిని ఇచ్చింది.
శ్రీకాకుళంలో ఉన్న పెద్ద కూతురు ఇంటికి అమ్మాయమ్మ మూడురోజుల క్రితం వచ్చింది. కాగా, శుక్రవారం సాయంత్రం ఆమె తన అల్లుడు ప్రసాద్ తో మాట్లాడుతూ తన పొలంలో 9 సెంట్లు చిన్నకూతురుకు ఇవ్వనున్నట్లు చెప్పింది. దీనికి ప్రసాద్ అభ్యంతరం చెప్పాడు. ఈ విషయం పై ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి గొడవ జరిగింది. ఈ గొడవ జరుగుతున్న సమయంలో ప్రసాద్ ఆవేశంతో రోకలి బండతో అమ్మాయమ్మ తలపై మోదాడు. దీంతో ఆమె తలకు తీవ్రగాయం అయింది. కుటుంబసభ్యలు వెంటనే ఆమెను రిమ్స్ కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసిన రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: అమెరికాలో సంచలనం రేపుతున్న భారతీయ దంపతుల అనుమానస్పద మృతి.. ఇది హత్యేనా..? దర్యాప్తు ముమ్మరం
కొద్దిరోజుల్లో పెళ్లి.. కానీ యువతి దారుణ హత్య..! కాబోయే వరుడి పనేనా..? కారణాలు ఇలా ఉన్నాయి..