Bihar: పాఠశాల గోడ కూలి ఆరుగురు కూలీల దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు

|

Mar 09, 2021 | 2:37 PM

School Wall Collapses: బీహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల గోడ కూలి ఆరుగురు కూలీలు..

Bihar: పాఠశాల గోడ కూలి ఆరుగురు కూలీల దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు
Follow us on

School Wall Collapses: బీహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల గోడ కూలి ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బీహార్‌లోని ఖగారియా జిల్లాలో సోమవారం జరిగింది. మహేష్‌ఖంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చండితోలా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద కొత్తగా కాలువను నిర్మిస్తున్నారు. జల్ నల్ పథకంలో భాగంగా కూలీలు కాల్వ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో తవ్వకాలు జరుపుతున్న జేసీబీ స్కూల్‌ కాంపౌడ్‌ వా‌ల్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా కూలింది. దీంతో అక్కడ పనులు చేస్తున్న 12 మంది కూలీలు గోడ శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిలో ఆరుగురు మరణించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు.

కాంట్రాక్టర్‌ నిర్లక్షం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటన అనంతరం జేసీబీ డ్రైవర్‌, కాంట్రాక్టర్ పారిపోయారని.. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

కాగా.. ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ విచారం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

Also Read:

Karnataka Crime : కర్ణాటకలో దారుణం.. అనుమానంతో భార్యను ముక్కలు ముక్కలుగా నరికిచంపిన భర్త.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

కోల్ కతా అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి 2 లక్షల ఎక్స్ గ్రేషియా