నరమాంస భక్షకులు.. మృతదేహాన్ని పీక్కుతిని.. పుర్రెతో నృత్యాలు చేసిన మాంత్రికులు..
Samiyaadis eat human flesh: కొంతమంది మాంత్రికులు.. పుర్రెతో నృత్యాలు చేసిన సంఘటన తమిళనాడులో కలకలం సృష్టించింది. తమిళనాడులోని
Samiyaadis eat human flesh: కొంతమంది మాంత్రికులు.. పుర్రెతో నృత్యాలు చేసిన సంఘటన తమిళనాడులో కలకలం సృష్టించింది. తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాలో కొందరు మాంత్రికులు నరమాంసం తిని పుర్రెతో నృత్యాలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అభియోగంపై పోలీసులు 10 మందిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ షాకింగ్ సంఘటన తెన్‌కాశిలోని కల్లురాణి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో జరిగిన ఓ వేడుకలో మాంత్రికులు ఈ విధంగా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన అనంతరం.. గ్రామ పాలనాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కట్టు కోవిల గుడిలో ఎవరి మృతదేహాన్ని భక్షించారో తెలుసుకునేందుకు కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే.. మృతదేహాన్ని ఎప్పుడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయంపై కూడా పోలీసులకు ఇంకా ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదు. ఆ సమయంలో మాంత్రికులు మత్తులో ఉన్నామని.. ఆ గ్రామ దేవత వారిని ఆవహించిందని పేర్కొంటున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే, సగం కాలిన మృతదేహాన్ని ఏదైనా గ్రామంలోని శ్మశానవాటిక నుంచి తీసుకొచ్చారా? లేక మరైదేమైనా విషయం దాగి ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2019లో కూడా ఇదే గ్రామంలో కొందరు వ్యక్తులు మనిషి పుర్రెను తీసుకొచ్చి ఇదే తరహాలో ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.
Also Read: