RPF Constable: కదులుతున్న రైల్లో కానిస్టేబుల్ కాల్పులు.. నలుగురు మృతి! వీడియో వైరల్

|

Jul 31, 2023 | 3:21 PM

కదులుతున్న రైలులో రైల్వే గార్డు కాల్పులు జరిపి కలకలం సృష్టించాడు. ఈ ఘటనలో ఒక సీనియర్‌ రైల్వే అధికారితో సహా మరో ముగ్గురు ప్యాసింజర్లు మృతి చెందారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన చేతన్ సింగ్ (33) అనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ జైపూర్-ముంబై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో..

RPF Constable: కదులుతున్న రైల్లో కానిస్టేబుల్ కాల్పులు.. నలుగురు మృతి! వీడియో వైరల్
RPF Constable Chetan Singh
Follow us on

ముంబాయి, జులై 31: కదులుతున్న రైలులో రైల్వే గార్డు కాల్పులు జరిపి కలకలం సృష్టించాడు. ఈ ఘటనలో ఒక సీనియర్‌ రైల్వే అధికారితో సహా మరో ముగ్గురు ప్యాసింజర్లు మృతి చెందారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన చేతన్ సింగ్ (33) అనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ జైపూర్-ముంబై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం ఉదయం తన సర్వీస్‌ రివాల్వర్‌ నుంచి 12 రౌండ్లు కాల్పులు జరిపాడు. అతని సీనియర్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) తికారమ్ మీనాతోపాటు మరో ముగ్గురు రైల్వే ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కాల్పుల అనంతరం సింగ్, రైలు అలారం చైన్‌ని లాగి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. చేతన్‌ సింగ్‌ జరిపిన 12 రౌండ్లు కాల్పుల్లో అతని రైఫిల్‌తో పాటు ఏఎస్‌ఐ మీనా పిస్టల్ నుంచి కూడా కాల్పులు జరిపాడు. కాల్పులకు గల కారణం ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

పశ్చిమ రైల్వే ఇన్‌స్పెక్టర్ జనరల్ కమ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ పీసీ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. కానిస్టేబుల్ చేతన్ సింగ్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. మొదట తన పై అధికారి అయిన తికారమ్‌ మీనాను కాల్చి, ఆ తర్వాత అడ్డుకో బోయిన మరో ముగ్గురు రైల్వే ప్రయానికులను వారిని కాల్చాడని వెల్లడించారు. సింగ్‌ 12 ఏళ్లుకు పైగా ఆర్‌పీఎఫ్‌లో పనిచేస్తున్నాడు. 12 రోజుల సెలవుపై వెళ్లిన సింగ్‌ జూలై 18న తిరిగి విధులకు హాజరయ్యాడు. రైలులో సింగ్, మీనాతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు విధుల్లో ఉన్నారు. సంఘటన జరిగిన సమయంలో మిగతా ఇద్దరు కానిస్టేబుళ్లు నరేంద్ర పర్మార్, అమయ్ ఇతర కోచ్‌లలో ఉన్నారని పీసీ సిన్హా తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి