Kolkata: కోల్‌కతా విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రేడియో యాక్టీవ్ మెటల్ కాలిఫోర్నియంను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాలిఫోర్నియంను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న కాలిఫోర్నియం విలువ సుమారు రూ. 4,250 కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ఈ కాలిఫోర్నియం స్మగ్లింగ్‌కు సంబంధించి విశ్వసనీయ సమాచారం అందుకున్న అధికారులు.. పక్కా ప్రణాళిక ప్రకారం నిందితులను పట్టుకున్నారు. కాగా, వీరి వద్ద దాదాపు 250.5 గ్రాముల బరువు ఉన్న బూడిద రంగు రాళ్లు నాలుగు ముక్కలను సీఐడీ అధికారులు గుర్తించారు.
ముందుగా వీరివద్ద ఉన్న ఈ రాళ్లు చీకట్లో మెరవడమే కాకుండా.. ఆ రాళ్ల నుంచి కాంతి ప్రతిబింబించడాన్ని అధికారులు గుర్తించారు. దాంతో వీటిని కాలిఫోర్నియం కావొచ్చని భావించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాలిఫోర్నియం ధర భారత కరెన్నీ ప్రకారం గ్రాముకు రూ. 17 కోట్లు ఉంటుంది.
రేడియోధార్మిక మెటల్ కాలిఫోర్నియం అంటే ఏమిటి?
దేశంలోని సామాన్యుడు రేడియోధార్మిక పదార్ధం అయిన కాలిఫోర్నియం ను కొనలేరు, అమ్మలేరు. ఇది చాలా ఖరీదైనది. ఈ రేడియోధార్మిక పదార్థాలు లైసెన్స్‌దారుల ద్వారా మాత్రమే విక్రయించబడుతాయి. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుండి మాత్రమే కాలిఫోర్నియం దేశంలో అందుబాటులో ఉంది. ఈ రేడియోధార్మిక పదార్థం కాలిఫోర్నియం సింథటిక్. దీని రంగు వెండి మాదిరిగా ఉంటుంది. కాలిఫోర్నియా సబ్బు లాంటిది, దీనిని బ్లేడుతో ముక్కలుగా కట్ చేయవచ్చు. కాలిఫోర్నియం ఉత్పత్తి చాలా తక్కువ. ఇది చాలా అరుదు. అందుకే ఒక గ్రాము కాలిఫోర్నియం ధర రూ. 170 మిలియన్లకు పైగా ఉంటుంది.
కాలిఫోర్నియాను క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు.. ప్రాణాంతకం కూడా..
కాలిఫోర్నియం పదార్థా్న్ని క్యాన్సర్ చికిత్సలో, పారిశ్రామిక రంగంలో ఉపయోగిస్తారు. వైద్య రంగంలో దీనిని క్యాన్సర్ రోగుల కోసం, ఎక్స్-రే యంత్రాలలో ఉపయోగిస్తారు. ఇక పారిశ్రామిక రంగంలో పోర్టబుల్ మెటల్ డిటెక్టర్‌లతో పాటు, చమురు బావులలో నీరు, చమురు పొరలను గుర్తించడం.. బంగారం, వెండిని గుర్తించడం కోసం దీనిని ఉపయోగిస్తారు. అంతేకాదు.. ఈ కాలిఫోర్నియం ఒక ప్రమాదకరమైన రేడియోధార్మిక లోహం, ఇది మనుషులకు, జంతువులకు, పక్షులకు ప్రాణాంతకం. దాని ప్రభావం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పూర్తి ధ్వంసం చేస్తుంది. లుకేమియా, గర్భస్రావం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
Also read:
RRR Movie: గుమ్మడికాయ కొట్టిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.. ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసిన జక్కన్న..
IND vs ENG 3rd Test Day 2 Live: భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్ టీం.. చమటోడుస్తోన్న భారత బౌలర్లు