బ్రేకింగ్ః కృష్ణా నదిలో మునిగిన పుట్టి.. నలుగురు గల్లంతు
కృష్ణా నదిలో ఓ పుట్టి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు గల్లంతు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా పరిధిలోని మక్తల్ మండలం పంచదేవల పహాడ్ నుంచి మూడు పుట్టిల్లో కూలీలు కర్ణాటక రాష్ట్ర రాయ్‌చూర్‌లోని కురవాపురం గ్రామానికి వెళ్తుండగా..

కృష్ణా నదిలో ఓ పుట్టి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు గల్లంతు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా పరిధిలోని మక్తల్ మండలం పంచదేవల పహాడ్ నుంచి మూడు పుట్టిల్లో కూలీలు కర్ణాటక రాష్ట్ర రాయ్‌చూర్‌లోని కురవాపురం గ్రామానికి వెళ్తుండగా నది దాటే క్రమంలో ఓ పుట్టి నీటిలో మునిగింది. వీరంతా కిరణా సామానట్లు కొనుగోలు చేసుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పసుపుల వద్దకు రాగానే పట్టి పల్టీ కొట్టడంతో అందరూ నీటిలో మునిగిపోయారు. వెంటనే మరో పుట్టిలోని ప్రయాణికులు అప్రమత్తమై కొంతమందిని సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చగా.. మరో నలుగురు గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన వారిలో ఓ చిన్న పాప కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు.
Read More:
మళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధరలు
బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం



