Veeravalli Toll Plaza: పశ్చిమగోదావరి జిల్లాలో కరెన్సీ నోట్ల కట్టలు కలకలంరేపాయి. నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా సమీపంలో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం టోల్ ప్లాజా దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈలోపు పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన AP 39 TB 7555 నంబరు గల బస్సు అటు వైపు వచ్చింది. అనుమానంతో బస్సును ఆపిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. బస్సు లగేజ్ డిక్కీలు, సీట్ల కింద సోదాలు చేయగా.. భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఎవరి కంటపడకుండా డబ్బుల్ని ఇలా దాచి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. కరెన్సీ నోట్ల కట్టల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ క్లీనర్,ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదు తరలింపు వెనుక ఎవరున్నారో వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
కాగా పట్టుబడిన నగదు మొత్తం 4 కోట్ల 76 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నగదును టోల్ ప్లాజా కార్యాలయంలో ఉంచారు. ఐటీ అధికారుల సమక్షంలో ఆ డబ్బుల్ని లెక్కించే అవకాశం ఉంది. కాగా ఇటీవల హైవేలు అక్రమ రవాణాకు అడ్డాగా మారాయి. కొందరు అక్రమార్కులు ఎవరికీ అనుమానం రాకుండా నగదు, బంగారం, వెండి, మద్యం బాటిళ్లను తరలిస్తున్నారు. . కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద హైదరాబాద్ నుంచి ఓ కారును తనిఖీ చేయగా సీటు కింద కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. డ్రైవర్ సీటు కింద ఉన్న టూల్ బాక్సులో ఏకంగా రూ. 65 లక్షల నగదు బయట పడింది. అంతకుముందు చాలా సార్లు పెద్ద మొత్తంలో నగదు, మద్యం బాటిళ్లను అధికారులు పట్టుకున్నారు.
Also Read:PM Modi: వాట్సప్ , సోషల్ మీడియాకు దూరంగా ఉండండి.. విద్యార్థులకు ప్రధాని మోడీ సూచన..
RIMS Recruitment: ఆదిలాబాద్ రిమ్స్‌లో ఉద్యోగాలు… నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..
Karnataka: ముచ్చటపడి వైన్ ఆర్డరిచ్చిన యువతి.. కట్ చేస్తే ఓ ఫోన్ కాల్.. చివరికి దిమ్మతిరిగే షాక్!