Patient Attacked Doctor: కోవిడ్ సెంటర్‌లో దారుణం.. డాక్టర్‌పై కరోనా రోగి దాడి.. సెలైన్ స్టాండ్‌తో..

|

Jul 15, 2021 | 9:42 AM

Covid-19 Patient Attacked Doctor: దేశంలో ఇటీవల కాలంలో వైద్యులపై దాడులు పెరుగుతున్నాయి. చికిత్సలో వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బంధువులు చనిపోతున్నారని.. దాడులు జరుగుతున్న

Patient Attacked Doctor: కోవిడ్ సెంటర్‌లో దారుణం.. డాక్టర్‌పై కరోనా రోగి దాడి.. సెలైన్ స్టాండ్‌తో..
Doctor
Follow us on

Covid-19 Patient Attacked Doctor: దేశంలో ఇటీవల కాలంలో వైద్యులపై దాడులు పెరుగుతున్నాయి. చికిత్సలో వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బంధువులు చనిపోతున్నారని.. దాడులు జరుగుతున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఓ ఆసుపత్రిలో కరోనా సోకి చికిత్స పొందుతున్న ఓ రోగి డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో డాక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. అతన్ని ఐసీయూ చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని అలీబాగ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అలీబాగ్‌ జిల్లా జనరల్‌ ఆసుపత్రిలోని కోవిడ్‌ బ్లాక్‌లో 55 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. అతను కరోనాతో నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై సెలైన్ స్టాండ్‌తో దాడికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.

సెలైన్‌ స్టాండ్‌తో కొట్టడంతో డాక్టర్‌‌కు తీవ్ర గాయాలయ్యాయని అలీబాగ్ పోలీసులు వెల్లడించారు. దీంతో డాక్టర్‌‌ను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బాధిత వైద్యుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే.. రోగి వెనుక నుంచి వచ్చి డ్యూటీలో ఉన్న డాక్టర్ స్వాప్నాదీప్ థాలే తలపై సెలైన్ స్టాండ్‌తో బలంగా కొట్టాడని పేర్కొన్నారు. రోగిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే డాక్టర్‌పై ఎందుకు దాడి చేశాడనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

Also Read:

Cake Drugs: సైకాలజిస్ట్ నయా దందా.. కేకుల్లో డ్రగ్స్‌ పెట్టి రేవ్ పార్టీలకు సరఫరా.. విచారణలో షాకింగ్ నిజాలు

హైదరాబాద్‌‌‌‌లో కాల్పులు కలకలం.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోగిన తుపాకుల మోత