Cyber Crime: యాప్ డౌన్లోడ్ చేయించి డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో ట్రాప్ చేశారు.. ఎంతకి.. ఎలా ముంచేశారంటే..!
డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో ట్రాప్ చేసిన కేటుగాళ్లు అరకోటికి ముంచేశారు..! హైదరాబాద్ మాదన్నపేటకి చెందిన అబ్దుల్ ఆదిల్ కి కాల్ చేసి డైమండ్స్ ట్రేడింగ్‌లో
Diamonds Trading: డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో ట్రాప్ చేసిన కేటుగాళ్లు అరకోటికి ముంచేశారు..! హైదరాబాద్ మాదన్నపేటకి చెందిన అబ్దుల్ ఆదిల్ కి కాల్ చేసి డైమండ్స్ ట్రేడింగ్‌లో నాలుగైదు రెట్లు లాభాలు వస్తాయి అంటూ ముగ్గులోకి లాగారు..! దీనికోసం యాప్‌ని డౌన్లోడ్ చేయించి పెట్టిన పెట్టుబడికి అత్యధిక లాభాలు వస్తున్నట్టు యాప్‌లో చూపిస్తూ వచ్చారు. ఇలా మొత్తం ₹43 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. తర్వాత యాప్ లింక్ ను డిలీట్ చేయడంతో మోసపోయానని గ్రహించిన అబ్దుల్.. సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే.. అత్యాశ లక్షలు, కోట్లకు ముంచేస్తోంది. యాప్ ద్వారా డైమండ్స్ ట్రేడింగ్ కోట్ల సంపాదించొచ్చని ఎవడో చెప్పడం, దాన్ని నమ్మడం ఫైనల్‌గా అరకోటి పోగొట్టుకోవడం.. ఇదీ హైదరాబాద్‌లో జరిగిన ఉదంతం. మాదన్నపేట కి చెందిన అబ్దుల్ ఆదిల్ కి కాల్ చేశారు కొందరు. డైమండ్స్ ట్రేడింగ్ లో నాలుగైదు రెట్లు లాభాలు వస్తాయని చెప్పుకొచ్చారు. డబ్బంటే ఆశతో ఎలా ఏంటీ అని వివరాలు అడిగాడు అబ్దుల్. Idex.appfact.club అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని.. పెట్టుబడి పెట్టిన తర్వాత వచ్చే లాభాలు ఇలా ఉంటాయంటూ ప్రీప్లాన్డ్‌గా రెడీ చేసుకున్న సాఫ్ట్‌వేర్‌తో బురిడీ కొట్టించారు. అది కాస్తా నమ్మిన అబ్దుల్.. ₹43 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. అతను అలా ట్రాన్స్‌ఫర్ చేశాడో లేదో…. యాప్ లింక్ డిలీట్ అయిపోయింది. 43 లక్షలు పోయిన తర్వాత గానీ.. మోసపోయాను అని తెలుసుకోలేకపోయాడు అబ్దుల్.
వాట్సాప్, క్రెడిట్ కార్డ్ క్లోనింగ్ ద్వారా మోసాలు..
సైబర్ కేటుగాళ్లు రోజురోజుకూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మరో అడుగుముందుకేసి వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి మరీ మోసాలకు పాల్పడుతున్నారు. బిట్ కాయిన్ – ఎం8 పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి చాంద్రాయణగుట్టకి చెందిన షేక్ నసీబుద్దీన్ ఫోన్ నెంబర్ ను అందులో యాడ్ చేశారా మాయగాళ్లు.
బిట్ కాయిన్ వ్యాపారంపై ట్రైనింగ్ ఇస్తున్నట్టు నసీబుద్దీన్‌ను మభ్యపెట్టారు. ఇలా అతడి నుండి పలు విడతలుగా మొత్తం 14 లక్షలకు పైగా కాజేశారు కేటుగాళ్లు. డబ్బులు కాజేసిన వెంటనే వాట్సాప్ గ్రూప్ డిలీట్ చేశారు. దీంతో లబోదిబోమంటూ సిటీ సైబర్ క్రైమ్స్‌లో బాధితుడు నసీబుద్దీన్ ఫిర్యాదు చేశాడు.
ఇదిలాఉంటే, హైదరాబాద్ పంజాగుట్టకు చెందిన బిజినెస్ ఉమెన్ రేఖకు చెందిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ రెండు క్రెడిట్ కార్డుల నుండి ఆమెకు తెలియకుండానే ₹5.70 లక్షలు కాజేశారు కేటుగాళ్లు. దీంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. క్లోనింగ్ ద్వారా కేటుగాళ్లు నకిలీ కార్డులు సృష్టించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read also: Yadadri: యాదాద్రి జిల్లాలో హైవేపై టిప్పర్ లారీ – ట్రావెల్స్ బస్సు ఢీ.. భీకర దృశ్యాలు.!