నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. బండ్లకు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లుకు బండ్ల గణేష్ ఇచ్చిన 1.25 కోట్ల చెక్కు బౌన్స్ అయింది. దీంతో అతను కోర్టును ఆశ్రయించాడు. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుసార్లు ఆదేశించినప్పటికీ బండ్ల గణేష్ స్పందిచలేదు. దీంతో ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. దీంతో బండ్ల గణేశ్ ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఎదుట మధ్యాహ్నంపైన హాజరయ్యారు.
బండ్ల గణేష్‌పై ఏపీలోనే గతంలో మరో కేసు కూడా నమోదైంది. అది కూడా ఫైనాన్షియల్ మ్యాటరే. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర రూ.13 కోట్లు తీసుకున్నారట. అయితే తిరిగి చెల్లించకపోవడంతో.. బండ్ల గణేష్‌పై కడపలో మహేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కోర్టు విచారణకు బండ్ల గణేష్ హాజరు కాకపోవడంతో.. ఆయనపై అప్పట్లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు కడప మెజిస్ట్రేట్. అనంతరం బండ్లను అరెస్ట్ చేసి కడప జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు పోలీసులు.
Also Read: మార్కెట్లో కొత్త అమ్మవారు.. దర్శిస్తే సకల అరిష్టాలు పోతాయట.. పోటెత్తుతున్న జనం
Anasuya: ‘అనసూయ నా చేతిని టచ్ చేసింది’.. అభిమాని సంబరం చూడండి