Honour Killing in Bihar: దేశంలో ఇటీవల కాలంలో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. వేరే కులాలకు చెందిన వారిని తమ పిల్లలు ప్రేమ పెళ్లిళ్లు (Love Marriage) చేసుకున్నారన్న కారణంతో కుటుంబసభ్యులు దారుణానికి పాల్పడుతున్నారు. తాజాగా.. బీహార్‌లో జరిగిన పరువు హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తన కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో.. ఏడాది తర్వాత తండ్రి, కొడుకుతో కలిసి దారుణంగా హత్య చేశాడు. కటింగ్ షాపులో షేవింగ్ చేయించుకుంటూ ఉండగా.. అతనిపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతోపాటు అతనిపై విచక్షణారహితంగా దాడిచేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ దారుణ ఘటన ఆదివారం బీహార్‌లోని బక్సర్ జిల్లా దుమ్రావాన్ గ్రామంలో చోటుచేసుకుంది. తన కుమార్తె వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న ఒక సంవత్సరం తర్వాత..తన కొడుకు సహాయంతో తండ్రి తన అల్లుడిని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి.
వీడియోలో ఒక వ్యక్తి బార్బర్ షాప్‌లో షేవింగ్ చేయించుకుంటుండగా.. ఓ యువకుడు అకస్మాత్తుగా తిరిగి పిస్టల్‌తో అతని తలపై కాల్చాడు. అది గురితప్పడంతో.. బాధితుడు లేచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడున్న మంగలి మరో వ్యక్తి కూడా బయటకు పరుగెత్తారు. అనంతరం కాల్పులు జరిపిన వ్యక్తి షాప్‌లో తీసుకున్న రేజర్‌తో బాధితుడిపై దాడి చేస్తాడు. ఆ తర్వాత అతనితో పాటు మరో వ్యక్తి పిస్టల్‌తో వచ్చాడు. అతను అతని తలపై మళ్లీ కాల్చాడు. ఇద్దరు దాడి చేసి అతన్ని ఒక మూలకు లాగారు. ఈ క్రమంలో షూటర్లు తమ తుపాకీలను మళ్లీ లోడ్ చేయడం కనిపించింది. అదే సమయంలో కదలకుండా నేలపై పడి ఉన్న ఆ వ్యక్తిపై భౌతికంగా దాడి చేశారు.
రక్తపుమడుగులో పడి ఉన్న ఆ వ్యక్తిని వదిలి.. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడిని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ సోను రాయ్ సోదరుడు మోను రాయ్‌గా గుర్తించారు. రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది అయిన మామ సునీల్ పాఠక్.. అనంతరం ఎస్పీకి ఫోన్ చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో అతని కుమారుడు ధను పాఠక్ కూడా అరెస్టయ్యాడు.
వీడియో..
अंतरजातीय विवाह करने की मोनू राय को उनके ससुर रिटायर्ड फ़ौजी ससुर सुनील पाठक ने अपने बेटे के साथ बक्सर ज़िले के डुमरांव में गोली मार कर हत्या कर सजा दी और बाद में खुद एसपी को फ़ोन कर सरेंडर भी किया @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/VDzhUjmHcx
— manish (@manishndtv) June 7, 2022
ప్రేమ వివాహం కారణంగానే హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను గుర్తించామని, వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..