Aravalamma Jatara : పవిత్రమైన జాతరలో అశ్లీల నృత్యాలు నిర్వహించి ఆలయ ఆచారాలను భ్రష్ఠు పట్టిస్తున్నారు కొంతమంది. సీతానగరం మండలంలోని చీపురుపల్లి గ్రామపంచాయతీ అచ్చియ్యపాలెం గ్రామ సమీపంలో కొలువై ఉన్న అరవాలమ్మ తల్లి జాతరలో ఈ తంతు జరిగింది. ఆర్కెస్ట్రా పేరుతో స్టేజ్ డెకరేషన్ ఆర్భాటాలతో పట్టపగలే మహిళలు భోజనాలు చేస్తుండగా.. మండల చివర్లో అశ్లీల నృత్యాలు నిర్వహించారు. నూతన సర్పంచ్, సర్పంచ్ అనుచరుల సహకారంతోనే ఈ డ్యాన్స్‌లు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ఇప్పడు చర్చనీయాంశమైంది.
పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఈ అశ్లీల నృత్యాలు ఏంటని పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇటువంటి డ్యాన్స్‌లతో నేటి యువతకు మీరు ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటిని చూసే కదా యువత తప్పుదోవ పడుతుందని ఆగ్రహిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక నేతలు స్పందించి మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అంటున్నారు. మరి నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.. ఇదిలా ఉంటే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కమిటీ మెంబర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారో ఆరా తీస్తున్నారు.