BoB: లెక్క తేల్చారు.. చిక్కు ముడి విప్పారు.. దొంగ గుట్టు విప్పారు.. తొమ్మిది మంది ఉద్యోగులపై వేటు వేశారు..

చిత్తూరు జిల్లా కనికిరి బ్యాంక్‌ సిబ్బందిపై వేటు పడింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కేసులో 9మంది ఉద్యోగులపై వేటు వేశారు అధికారులు. ఆ 9 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు.

BoB: లెక్క తేల్చారు.. చిక్కు ముడి విప్పారు.. దొంగ గుట్టు విప్పారు.. తొమ్మిది మంది ఉద్యోగులపై వేటు వేశారు..
Bank Of Baroda Kalikiri Bra
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 07, 2021 | 12:26 PM

చిత్తూరు జిల్లా కనికిరి బ్యాంక్‌ సిబ్బందిపై వేటు పడింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కేసులో 9మంది ఉద్యోగులపై వేటు వేశారు అధికారులు. ఆ తొమ్మిది మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. మరోవైపు సస్పెండైన 9మంది ఉద్యోగులను విచారిస్తున్నారు పోలీసులు. డ్వాక్రా సంఘాల నుంచి కాజేసిన సొమ్మును బ్యాంకు సిబ్బందికి.. వాటాలుగా ఇచ్చినట్టు అంగీకరించిన మెసెంజర్‌ అలీఖాన్‌. స్వయం సహాయక సంఘాలే టార్గెట్ గా మెసెంజర్ అలీఖాన్ ఖాతాలు ఖాళీ చేసినట్లు తేలింది. ఇప్పటి వరకూ సుమారు 1.80 కోట్ల రూపాయలు స్వాహా అయినట్టు తేలగా.. బ్యాంకుకు సంబంధించిన ఇతర లావాదేవీలన్నింటినీ పరిశీలిస్తున్నారు విచారణ బృందం అధికారులు. మెసెంజర్ అలీ ఖాన్ నోటి వెంట ఒక్కో నిజాలను వెళ్లగక్కిస్తున్నారు. దీంతో ఇన్నాళ్ల పాటు బ్యాంకులో జరిగిన అవకతవకలు ఒకదాని వెంట మరొకటిగా వెలుగులోకి వస్తున్నాయి.

కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా- కాస్తా మెసెంజర్ చేతివాటంతో కిరికిరి బ్యాంకుగా మారిన పేరు సాధించింది. బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము స్వాహా విషయంపై విచారణ చేసిన అధికారులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి వచ్చాయి. ఒక్కో విషయం బయట పడ్డంతో అధికారులకు మైండ్ బ్లాంక్ అవుతోంది. బ్యాంకులో మెసెంజర్‌గా చేస్తున్న అలీ ఖాన్ అక్కడి సిబ్బంది సహకారంతోనే ఈ వ్యవహారం నడిపినట్టు తేల్చారు అధికారులు.

తిరుపతి రీజినల్ మేనేజర్ నేతృత్వంలో 10 మంది తో కూడిన బృందం బ్యాంకులో ఎంక్వయిరీ చేస్తోంది. మొత్తం 103 కోట్ల రూపాయల లావాదేవీల్లో.. ఎస్ హెచ్ జీ గ్రూప్ కు చెందిన డబ్బు ఎక్కువగా దారి తప్పినట్టు గుర్తించారు. మహిళా సంఘాల పేరిట నకిలీ పత్రాలతో రుణాలు తీసుకున్నారనీ.. ఈ సొమ్మును బ్యాంకులో పని చేసే ఉద్యోగులందరికీ వాటాలు పంచానని అలీ ఖాన్ అనడంతో ఒక్కొక్కరికీ గుండెలదురుతున్నాయి.

బ్యాంకు స్టేట్ మెంట్లను ఎడిట్ చేసి స్వయం సహాయక సంఘాలకు అనుమానం రాకుండా తాను ప్రయత్నించాననీ చెప్పుకొచ్చాడు అలీఖాన్. ఇప్పటి వరకూ కోటీ 78 లక్షల రూపాయల నుంచి తాను ఎస్ హెచ్ జీ ఖాతాల నుంచి సొమ్ము కాజేసినట్టు ఒప్పుకున్నాడు.

ఈ డబ్బుతో తన అక్కచెల్లెళ్లకు ఘనంగా పెళ్లి చేయడం మాత్రమే కాదు.. కలికిరిలో ఇల్లు కూడా కట్టుకున్నాననీ.. మిగిలిన డబ్బుతో జల్సా చేశానని అలీ ఖాన్ చెప్పడంతో.. విస్తుపోయారు అధికారులు. గత వారం నుంచి.. బ్యాంక్ ఆఫ్ బరోడా స్కామ్ లో విచారణ జరుగుతుండగా.. ఈ బ్యాంకులో ఖాతాలున్నవారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బు క్షేమమేనా? తిరిగి మా ఖాతాల్లోకి వచ్చి చేరేనా? అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సేవింగ్ ఖాతాలు, పంట రుణాల ఖాతాల లెక్కల్లో తేడాలపై అగమ్యగోచరంగా ఉంది. గత ఐదేళ్లుగా బ్యాంకు లావాదేవీలు అడ్డ దిడ్డంగా సాగినట్టు గుర్తించారు అధికారులు. దీంతో విచారణ ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టారో తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: వీరిది సహాపంక్తి భోజనం.. తినడానికి పొంగలి.. రుచికరమైన వంటకాలు.. కానీ ప్లేట్లు.. విస్తరాకుల్లో కాదు.. మరీ ఎలా తింటారో తెలుసా..

Viral Video: గుర్రం తనను తాను అద్దంలో చూసుకుంటూ ఇలా చేసింది..! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. అందులో ఏముందంటే ??
ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. అందులో ఏముందంటే ??
24 గంటల్లో 80కి పైగా భూకంపాలు..
24 గంటల్లో 80కి పైగా భూకంపాలు..
మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌..
మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌..
రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ..
రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా